ఈ 7 మంది డైరెక్టర్లకి ఈ 7 మంది హీరోయిన్లు చాలా ఫేవరెట్…వారి కాంబినేషన్ లో అన్ని హిట్లే.!

Ads

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారనే విషయం తెలిసిందే. హీరో, డైరెక్టర్ల కాంబినేషన్ల సెంటిమెంట్‌ ఎక్కువగా పనిచేస్తుంది. ఆ కాంబో పై భారీగా బిజినెస్‌ జరుగుతుంటుంది. అలాగే హీరోహీరోయిన్ల కాంబో సెంటిమెంట్‌ కి కూడా ప్రాధాన్యత ఇస్తుంటారు.

టాలీవుడ్ లో ఇవే కాకుండా మరో సెంటిమెంట్‌ గురించి కూడా టాక్ వినిపిస్తుంది. స్టార్‌ దర్శకులు, స్టార్‌ హీరోయిన్ల సెంటిమెంట్‌ ను ఫాలో అవుతున్నారు. మూవీ హిట్‌ కోసం దర్శకులు తమ లక్కీ హీరోయిన్స్ ను  రిపీట్‌ చేస్తున్నారు. ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
1.  త్రివిక్రమ్ శ్రీనివాస్ – పూజా హెగ్దే:

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో మంది హీరోయిన్లతో పని చేశారు. అయితే హీరోయిన్ పూజా హెగ్దేను తన చిత్రాలలో రిపీట్ చేశారు. పూజా హెగ్దే నటించిన అరవింద సమేత, అల వైకుంటపురం సినిమాలు  విజయం సాధించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న గుంటూరు కారం మూవీలో ముందు పూజా హెగ్దేను తీసుకున్నారు. కానీ ఆమె ఈ మూవీని మిస్ చేసుకుంది.
2. గోపీచంద్ మాలినేని – శృతిహాసన్:

మాస్ దర్శకుడు గోపీచంద్ మాలినేని బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. ఈ మూడు సినిమాలు  సూపర్ హిట్ గా నిలిచాయి.
3. రాజమౌళి – అనుష్క శెట్టి:

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలలో చాలా మంది హీరోయిన్లు నటించారు. కానీ అనుష్క శెట్టి బాహుబలి  రెండు చిత్రాలలో నటించారు. ఆ సినిమాలు ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే.
4.  శివ నిర్వాణ – సమంత: 

Ads

డైరెక్టర్ శివ నిర్వాణ తీసింది నాలుగు సినిమాలే. వాటిలో రెండు చిత్రాలలో  స్టార్ హీరోయిన్ సమంతకు ఛాన్స్ ఇచ్చారు. సమంత నటించిన మజిలి, ఖుషి విజయం సాధించాయి.
5. వంశీ పైడిపల్లి – కాజల్ అగర్వాల్: 

డైరెక్టర్ వంశీ పైడిపల్లి బృందావనం మూవీతో మొదటి విజయన్ని అందుకున్నారు. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత వంశీ తీసిన ఎవడు మూవీలో కూడా కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు.
6. శేఖర్ కమ్ముల –  సాయిపల్లవి:

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫిల్ గుడ్ సినిమాలతో ఆడియెన్స్ ని అలరించారు. శేఖర్ కమ్ముల  హీరోయిన్ సాయిపల్లవితో రెండు సినిమాలను తెరకెక్కించారు. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో హిట్ అందుకున్నారు.
7. అజయ్ భూపతి – పాయల్ రాజ్ పుత్:

దర్శకుడు అజయ్ భూపతి పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఆర్ఎక్స్ 100 మూవీ తీశారు. అది ఏ రేంజ్ లో విజయం సాధించిదో తెలిసిందే. ఆరేళ్ల తర్వాత మంగళవారం మూవీతో తాజాగా హిట్ అందుకున్నారు. ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది.
Also Read: కిక్ సినిమాలో ఇలియానా చెల్లెలు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో చూడండి.!

Previous articleరెండవ సినిమాకే 70 లక్షలకి చేరుకొని ఖరీదైన యువ హీరో అయ్యాడు… ఇప్పుడు ఇండస్ట్రీనే ఏలుతున్నాడు..! ఎవరో కనిపెట్టగలరా..?
Next articleఈ ఫోటోలో ఉన్న పెళ్లికూతురు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే…!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.