Ads
చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా పెళ్లి కి ముందు జిమ్ కి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. బరువు తగ్గాలని… అందంగా కనపడాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పెళ్లి తేదీ దగ్గర పడే కొద్ది ఫిట్నెస్ మీద ఏకాగ్రత పెడుతూ ఉంటారు.
పెళ్లి ఇంకా ఆరు వారాలు ఏడు వారాలు ఉంటే ఎక్కువ సేపు వ్యాయామనకే సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇలా వ్యాయామం చేయడం వలన రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.
ఎక్కువగా వ్యాయామం చేస్తే ఈ సమస్యలు ఉంటాయి:
1. గతంలో మీరు వ్యాయామం చేయకుండా కేవలం ఇప్పుడే వ్యాయామం చేస్తే ఎముకలు, కీళ్లలో కంపనాలు వస్తాయి. ఇది శరీరాన్ని మెదడుని కూడా ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇలా సమస్య కలగడం వలన సర్జరీ కూడా చేయించుకోవలసి వస్తుంది.
2. ఇలా జిమ్ చేయడం కానీ కఠినమైన వ్యాయామాలు చేసినా కానీ ఎక్కువసేపు పరిగెత్తడం వంటివి చేసినా కూడా వెన్నెముక కీళ్లల్లో కంపనం వస్తుంది.
3. మెడ, వెన్నెముక, కీళ్లపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది.
Ads
4. అంతేకాక ఆహారపు అలవాట్లు సడెన్ గా మార్చుకున్నా, సడెన్ గా పిండి పదార్థాలని తగ్గించేసినా కూడా ప్రమాదమే. కాబట్టి ఈ తప్పు ని కూడా చెయ్యకండి.
5. అదే విధంగా బరువు పెరిగిపోతారని హఠాత్తుగా కొవ్వులను తగ్గించడం కూడా చాలా రిస్క్ తో కూడుకున్నది. కనుక ఈ తప్పు ని కూడా చెయ్యకండి.
6. పైగా మీరు ఒక సారి బరువు తగ్గడానికి ప్రయత్నం చేసి మళ్లీ మామూలుగా ఉన్నట్లయితే బరువు రెట్టింపు అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది మరెంత రిస్క్ ఏ. సో ఈ తప్పు ని కూడా పెళ్లి కి ముందు చెయ్యద్దు.
7. కానీ ప్రతి రోజు వ్యాయామం చేయడం వలన ఆరోగ్యంగా జీవించడానికి అవుతుంది. ప్రతీ రోజు మంచి ఆహారం తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని అనుసరించడం, సరిపడా నీళ్లు తీసుకోవడం వంటివి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది.