Ads
ఎక్కువమంది సెలబ్రిటీలు సెలబ్రిటీలనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఎప్పటి నుండో ఇలానే జరుగుతోంది. కొంత మంది మాత్రం వ్యాపారవేత్తలను చేసుకుంటూ ఉంటారు. అలానే మరి కొందరు వారి బావని లేదా మరదలిని పెళ్లి చేసుకుంటారు.
ఈ సెలబ్రిటీలు వారి సొంత మరదళ్ళనే పెళ్లి చేసుకున్నారు. మరి సొంత మరదలని పెళ్లి చేసుకున్న హీరోలు గురించి ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు నుండి ఆది, కార్తీ వరకు చాలా మంది నటులు వారి సొంత మరదళ్లనే పెళ్లి చేసుకున్నారు.
#1. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ:
అక్కినేని నాగేశ్వరావు సొంత మరదలు అయినా అన్నపూర్ణని వివాహం చేసుకున్నారు. వీళ్ళ వివాహం 1949లో అయింది. అప్పటికి ఏఎన్ఆర్ గారు 10 సినిమాల వరకు నటించారు.
#2. ఎన్టీఆర్, బసవతారకం:
ఎన్టీఆర్, బసవతారకం కూడా మేనమామ పిల్లలే. మరదలైన బసవతారకం ని ఎన్టీఆర్ గారు 1942లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అప్పటికి ఎన్టీఆర్ ఇంకా సినిమాల్లోకి రాలేదు. పెళ్లి తరవాతనే ఎన్టీఆర్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.
Ads
#3. కృష్ణ, ఇందిరా దేవి:
కృష్ణ ఇందిరా దేవి 1961 లో పెళ్లి చేసుకున్నారు. అయితే కృష్ణ గారు అప్పటికి సినిమాల్లోకి రాలేదు. వీళ్ళు కూడా బావ మరదళ్ళు. పెళ్లి అయినా నాలుగేళ్లకి కృష్ణ గారు సినిమాల్లోకి వచ్చారు.
#4. ఆది, అరుణ:
సాయికుమార్ కొడుకు ఆది కూడా సొంత మరదలు అయిన అరుణ ని పెళ్లి చేసుకున్నాడు. 2014లో తన మరదలు అరుణతో ఏడడుగులు వేశారు.
#5. కార్తీ, రజిని:
సొంత మరదలని కార్తీ కూడా పెళ్లి చేసుకున్నారు. 2011లో వీళ్ళ వివాహం అయింది.
#6. మోహన్ బాబు, విద్యా దేవి నిర్మల దేవి:
మోహన్ బాబు తన మరదలు విద్యాదేవిని వివాహం చేసుకున్నారు కానీ ఆమె చనిపోయిన తర్వాత విద్యా దేవి సొంత చెల్లి అయిన నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు.
Also Read: సొంత జెట్ విమానాలున్న టాలీవుడ్ హీరోలు వీరే..!