Ads
నందమూరి తారక రామారావు గారు తెలియని వారు ఉండరు. సీనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత పేరు ఉందో మనకి తెలుసు. నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడుగా కూడా పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు హోటళ్ళకి వెళితే తిన్నది కనిపించదు. బిల్లే కనపడుతుంది. ఇక ఫైవ్ స్టార్ హోటల్ కి వెళితే బిల్లు తడిసి మోపుడవుతుంది. అప్పట్లో ఎన్టీఆర్ గారు పరిపాలనలో ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టారుఅంట . వాటిని చూస్తే మీరు షాక్ అవుతారు. అప్పట్లో జనాలని హోటల్ వాళ్ళు దోచుకుంటున్నారని ఎన్టీఆర్ గారు అభిప్రాయపడ్డారు అంట. ఇక ఒక మంచి ఐడియా వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే.. హోటల్స్ కి కొన్ని కండిషన్స్ పెట్టారు.
Ads
ఆకలి వేసి హోటల్ కి వెళ్లి టిఫిన్ తిందాం అనుకుని వెళ్తే హోటల్ వాళ్ళు బాగా దోచేస్తున్నారు. అందుకే హోటల్ లో ఏఏ ఆహార పదార్థాలను ఎంతకి అమ్మాలి అని ఆయన నిర్ణయించారు. పైగా ఒక జీవోని కూడా పాస్ చేశారు అంట. ఇక ఆ జీవో లో ఉన్న విషయాలను చూద్దాం. హోటల్ వాళ్ళు ప్లేటు ఇడ్లీ పది పైసలు కన్నా ఎక్కువ అమ్మకూడదు అని చెప్పారు. దోస అయితే 15 పైసలు, పూరి అయితే 15 పైసలు, మసాలాదోశ అయితే 20 పైసలు మాత్రమే ఉండాలని ఎన్టీఆర్ కండిషన్ పెట్టారు. భోజనం విషయానికి వస్తే ఫుల్ మీల్స్ రూపాయి. ప్లేట్ మీల్స్ అర్ధరూపాయి ఉండాలని ఆ జీవోలో ఉంది.