ఇన్ని సంవత్సరాలైనా అదే అందం..! డాన్స్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

Ads

తెలుగు సీనియర్ హీరోయిన్ లు చాలామంది ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. కొందరు సినిమాలు మానేసి కుటుంబ జీవితం గడుపుతూ ఉంటే మరి కొందరు ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా బతుకుతూ ఉంటారు. ఒక ప్రముఖ సీనియర్ హీరోయిన్ కూడా తన కెరీర్ లో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

తర్వాత మదర్ క్యారెక్టర్లు ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేసి ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారు. ఇప్పుడు ఆమె డాన్స్ వీడియో ఒకటి ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది…. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా….?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రిగా పనిచేస్తున్న రోజా. అవును మీరు విన్నది నిజమే. రోజా హీరోయిన్ గా రిటైర్ అయిన తర్వాత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో ఆమె కనిపించేవారు. ఇప్పటికీ రోజా అందరికీ గుర్తున్నారంటే కారణం జబర్దస్త్ షోనే. ఆ షోలో ఆమె జడ్జిగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు స్కిట్ లలో నటిస్తూ స్టేజి పైన డ్యాన్సులు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.అలాంటిది రోజా 23 సంవత్సరాల క్రితం పెర్ఫార్మ్ చేసిన ఒక డాన్స్ వీడియో ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో కనిపిస్తుంది.

did you recognize this heroine in this video

కరు కరు కరుపాయ అనే తమిళ్ సాంగ్ కి రోజా ప్రభుదేవా తో కలిసి డాన్స్ వేశారు. అదే సాంగ్ కి ఒక ఈవెంట్ లో వేరే అతనితో కలిసి రోజా కాలు కదిపారు. ఇప్పుడు ఈ వీడియో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. రోజా ఎక్స్ప్రెషన్లు డ్యాన్స్ మూమెంట్లు భలేగా ఉన్నాయి. శేఖర్ మాస్టర్ తో కలిసి జబర్దస్త్ తో  రోజా ఎన్నో పాటలకు డాన్స్ వేశారు. సినిమాలు వదిలేసి రాజకీయాల్లో బిజీ అయినా కూడా తనలో నటన ఆసక్తి, డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏమాత్రం తగ్గలేదని రోజనిరూపిస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే రోజా సినిమాల్లోకి వచ్చేసరికి తన చక్కటి నవ్వుతో ముచ్చటగా కనిపిస్తూ ఉంటారు.

Watch Video:

 

Previous articleఓటీటీలో దూసుకెళ్తున్న ఈ సినిమా చూసారా.? ఏకంగా 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అంట.?
Next articleఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన టిఫిన్ ధరలు ఎంతో తెలుసా..? దోస ఖరీదు ఎంతంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.