ప్రతి దానికి కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అలానే ఉరిశిక్షను వేయడానికి కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. వీటిని ఫాలో అయి ఉరి శిక్ష విధిస్తారు. మన దేశంలో తీవ్రమైన నేరాలు చేసినప్పుడు శిక్షను విధిస్తారు. ఉరిశిక్ష విధించబడిన నిందితులు రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకోవచ్చు. అక్కడ కనుక శిక్ష రద్దు చేశారు అంటే జీవిత ఖైదు విధిస్తారు. అయితే ఉరిశిక్ష ఫార్మాలిటీస్ గురించి ఇప్పుడు చూద్దాం.
తెల్లవారుజామున 4 గంటలకు ఉరి శిక్ష వేస్తారు. ఎందుకంటే అప్పుడు అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పైగా ఆ సమయంలో జనాలందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. అలానే నిందితులకు ఇష్టమైన ఆహారాన్ని ఏదో కనుక్కొని ముందు రోజే వారికి వండి పెడతారు. ఇష్టమైన ఆహారాన్ని తిన్నాక నిందితులు నచ్చిన పనులు చేసుకోవచ్చు. అలానే నిందితుడికి ఇష్టమైన నీటితో స్నానం చేయడానికి కూడా అవకాశం ఇస్తారు.
శిక్ష విధించే రోజు ఉదయాన్నే మూడు గంటలకు నిద్ర లేపుతారు. ఆ తర్వాత వాళ్లు నిత్యం చేసే పనులు పూర్తి చేసుకుని రావాలి. ఒకవేళ కనుక దైవం మీద నమ్మకం ఉంటే ప్రార్థనలు కూడా చేసుకోవచ్చు. వైద్యుల చేత పరీక్షలు చేస్తారు. వాళ్ళు ఆరోగ్యంగా వున్నారంటేనే ఉరి అమలవుతుంది. అదే విధంగా ఉరి తీసే ముందు వారికి పడే శిక్షలుని మరియు చేసిన నేరాలని చెబుతారు. వివరాలన్నీ నేరస్తులకు వినిపించిన తర్వాత న్యాయమూర్తి అధికారులకు సైగ చేసి ఉరి తీయమంటారు. ఆ తరవాత వారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.