Ads
ఒక మనిషికి మరణం దగ్గరకు వస్తున్నప్పుడు కొన్ని సూచనలు కనిపిస్తాయట. ఈ సూచనలు ఆధారంగా ఆ వ్యక్తికి తన జీవితం చివరి దశలో ఉన్నట్టుగా తెలుస్తుందట. హిందూ మతంలో ఉన్నటు వంటి 18 పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి. గరుడ పురాణంలో ఒక మనిషి పుట్టినప్పటి నుండి మరణం దాకా అన్ని దశల గురించి వివరంగా చెప్పబడింది.
Ads
ఒక మనిషి తన జీవితం కాలంలో చేసిన పనుల ఆధారంగా శిక్షించబడతాడు. పాపం-పుణ్యం, ధర్మం-అధర్మం, జ్ఞానం-అజ్ఞానం, స్వర్గం-నరకం, నీతి-నియమాల గురించి గరుడపురాణంలో వివరించడం జరిగింది. గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఒక మనిషికి మృత్యువు సమీపిస్తున్నప్పుడు, దానికి సంబంధించిన కొన్ని సూచనలు చనిపోబోయే మనిషికి కనిపిస్తాయి. వాటి ద్వారా ఆ మనిషి తన లైఫ్ ముగియబోతుందని గ్రహిస్తారు. ఈ సూచనల వల్ల ఆ మనిషి తనకున్న కోరికలలో కొన్నింటిని అయినా తీర్చుకోవడానికి ఛాన్స్ కల్పించినట్లు అవుతుంది. మరి గురుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా మరణానికి ముందు ఎటువంటి సూచనలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం..
1. అరచేతి రేఖలు మసకబారడం:
గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం ఒక మనిషి మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ వ్యక్తి అరచేతిపై ఉండే గీతలు మసక బారడం మొదలవుతింది.
2. కలల్లో పూర్వీకులను చూడటం:
మనిషి జీవితం ముగియబోతున్న టైమ్ లో, కొద్ది రోజుల ముందు నుండి కలలో సూచనలు కనిపిస్తాయి. వారి పూర్వీకులు కలలో కనిపిస్తుంటారు. అలా కనిపించిన పూర్వీకులు ఏడుస్తూన్నట్టుగా లేదా పారిపోతున్నట్టుగా కనిపించినట్లయితే తమ మరణం సమీపంలో ఉందని గ్రహించాలి.
3. చుట్టూ ప్రతికూల శక్తి భావన:
ఒక మనిషి చుట్టూ ప్రతికూలమైన శక్తి ఉన్నట్లుగా అనిపించినపుడు ఏదైనా కీడు జరగబోతోందని గ్రహించాల్సి ఉంటుంది.
4. గరుడ పురాణం ప్రకారం..
ఒక మనిషికి మరణ గడియలు దగ్గరగా వస్తున్నప్పుడు చాలా రహస్యమైన విషయాలను కూడా చూడగలడు. అగ్ని, భూమి విచ్ఛిన్నం, వరద లాంటివి ఆ మనిషికి కనిపిస్తాయి.
5. చెడు పనులు గుర్తుకురావడం:
ఒక మనిషి మరణం దగ్గరగా ఉన్నప్పుడు తమ జీవితంలో చేసినటువంటి చెడు క్రియాలను గుర్తు చేసుకుంటాడు. వారి మనసులో ఆకస్మికంగా మార్పులు ప్రారంభం అవుతాయి. ఆ సమయంలో ఆ వ్యక్తి పశ్చాత్తాపపడతాడు.
Also Read: చెడు శక్తులు పోయి సమస్యలేమీ లేకుండా ఉండాలంటే… ఇలా హనుమంతుడిని పూజించండి..!