చెడు శక్తులు పోయి సమస్యలేమీ లేకుండా ఉండాలంటే… ఇలా హనుమంతుడిని పూజించండి..!

Ads

చాలా మంది హనుమంతుడిని పూజిస్తూ ఉంటారు. పైగా కష్టాలు, ఇబ్బందులు ఏమైనా ఉంటే హనుమంతుడిని తలుచుకోమని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు. అలానే రాత్రి నిద్ర పోయేటప్పుడు ఆంజనేయ స్వామి దండకం చదువుతుంటారు. చాలా మంది చెడు శక్తుల వలన నష్టాలు కలుగుతాయని ప్రమాదాలు జరుగుతాయని భయపడతారు. అలానే పిల్లలు తరచూ నిద్రలో ఏడవడం వంటివి జరిగినప్పుడు కూడా హనుమంతుడి బొమ్మ ని మెడలో కడతారు.

అయితే నిజానికి హనుమంతుడు పూజించినా హనుమంతుడిని తలుచుకున్నా భయాందోళనలు ఉండవని పెద్దలంటుంటారు. అలానే హనుమంతుడు ఉంటే ధైర్యంగా వుండచ్చని చాలా మంది నమ్ముతారు.

హనుమంతుడిని ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు కూడా. అలానే హనుమంతుడు దుష్ట శక్తులను తొలగిస్తారు. సమస్త గ్రహ, భూతప్రేత పిశాచాదులను కూడా దూరం చేస్తారట. అయితే ఈ సమస్యలేమీ మీకు కలగకుండా మీరు ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని వాస్తు నియమాలను తెలుసుకోవాలి. వీటిని మీరు అనుసరిస్తే ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదు. ఆంజనేయ స్వామి ఫోటో ని ఏ దిక్కు లో ఉంచాలి..? ఎలా ఆంజనేయ స్వామి ఫోటో ని పెడితే సమస్యలు లేకుండా వుండచ్చనేది తెలుసుకుందాం. చూసేయండి మరి.

Ads

  • మీ ఇంటి ఉత్తర దిశలో హనుమంతుడి ఫోటో ని ఉంచడం వలన చెడు శక్తులు లోపాలకి రావు.
  • ఆకాశమార్గంలో ఎగురుతున్న హనుమంతుడి ఫోటో ని పెడితే మరీ మంచిది.
  • హనుమంతుడు ఫొటో దక్షిణ దిశ వైపుకి చూసే విధంగా పెట్టండి. అప్పుడు దుష్టశక్తులు రావు.
  • ఇంట్లో హనుమంతుడు ఫొటో ఉంటే ఇంటి సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. చెడు ఆలోచనలు అన్నీ పోతాయి కూడా.

  • ఇంట్లో హనుమాన్ కి పూజ చేస్తే సుఖం, ధనం ఉంటుంది.
  • సమస్త గ్రహదోషాలు, పీడలు పోవాలంటే అగరువత్తి వెలిగించి హనుమాన్‌చాలీసా చదవండి.
  • పిల్లల్లో భయం ఉంటే హనుమాన్ చాలీసా చదవితే మంచిది.
Previous articleఆగష్టు 15, జనవరి 26న జాతీయ జెండాని ఎగురవేయడం మధ్య ఇంత తేడా ఉందా..? మీకు తెలుసా..?
Next article”వేణు తొట్టెంపూడి” భార్య ఎవరో మీకు తెలుసా..? ఆమె ఏం చేస్తోంది..?