Ads
తెలుగువారు అయినా కూడా తమిళ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గుర్తింపు సంపాదించుకున్న నటి అంజలి. అంజలి తమిళ సినిమాలతో పాటు, తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం అంజలి హీరోయిన్ గా నటించిన గీతాంజలి సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా వచ్చింది. గత నెల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.
కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. మొదటి భాగంలో ఉన్న శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. వారితో పాటు సత్య, సునీల్, రవిశంకర్, ప్రియ కూడా ఈ సినిమాలో నటించారు. సినిమా కథ మొదటి భాగానికి కొనసాగింపుగానే సాగుతుంది. ఒక సమస్య వల్ల వెళ్లిపోయిన గీతాంజలి ఆత్మ మళ్ళీ వస్తుంది. అసలు ఆ సమస్య ఏంటో అనేది తెలుసుకోవాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. మొదటి భాగం విడుదలైన సమయానికి హారర్ కామిడీ అనే జానర్ కొత్త.
Ads
దాంతో ఆ సమయంలో ఈ జానర్ లో వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి. కానీ మొదటి భాగం వచ్చిన సమయానికి, ఇప్పటికీ చాలా కాలం తేడా ఉంది. మధ్యలో ఇలాంటి జానర్ సినిమాలు చాలానే వచ్చాయి. దాంతో సినిమా చూస్తున్నప్పుడు కొత్తగా అనిపించదు. తెలిసిన కథలాగా అనిపిస్తుంది. టేకింగ్ పరంగా సినిమా బాగానే అనిపిస్తుంది. కానీ కథ బలహీనంగా అనిపిస్తుంది.
దాన్ని ఎంత బలంగా చూపించినా కూడా సినిమా ఆసక్తికరంగా సాగడం అనేది కష్టంగానే మారుతుంది. ఎండింగ్ పోర్షన్స్ చాలా హడావిడిగా తీసినట్టు అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా కథ అంత గొప్పగా లేకపోయినా కూడా నటీనటుల కోసం ఈ సినిమా ఒకసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.