ఈ పాటలో జయసుధతో పాటు ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యారు..! ఎవరో కనిపెట్టగలరా..?

Ads

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని పేరు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో సంవత్సరాల కష్టం ఉండాలి. ఓపిక ఉండాలి. ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే మన మీద మనకి నమ్మకం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఛాలెంజింగ్ ఫీల్డ్ లో మనిషి తట్టుకోగలుగుతారు. ఇప్పుడు గుర్తింపు తెచ్చుకున్న ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా గతంలో చిన్న చిన్న పాత్రలు వేయడం, లేదా ఇంకేదో సినిమాకు సంబంధించిన పని చేయడం చేశారు. అలా మెల్లగా సినిమాల్లోకి వచ్చి, సహాయ పాత్రల్లో నటించి ఇప్పుడు ఇంత గొప్ప పేరు సంపాదించుకున్నారు.

did you observe this choreographer in jayasudha aunty song

వాళ్లు ప్రస్తుతం ఉన్న స్థాయిని మాత్రమే మనం చూస్తాం. దాని వెనుక ఎంత కృషి ఉంది అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ పైన ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా అలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. ముందుగా డాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టి, ఆ తర్వాత కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో అయ్యారు. ఎంతో మందికి సహాయం కూడా చేస్తున్నారు. ఈ పాటలో జయసుధ గారితో పాటు ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా పెద్ద కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ అయ్యారు. అతను ఎవరో ఈపాటికి మీలో చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. ఈ పాటలో రాఘవ లారెన్స్ మాస్టర్ జయసుధ గారితో పాటు ఉన్నారు.

Ads

ఆంటీ సినిమాలోని టైటిల్ సాంగ్ ఇది. ఇందులో లారెన్స్ కొంచెం సేపు కనిపించి డాన్స్ వేస్తారు. ఆ సమయంలో లారెన్స్ వేసిన స్టెప్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ పాటలో లారెన్స్ కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారు. కానీ పేరు మాత్రం చాలా ఎక్కువగా వచ్చింది. ఈ సినిమా తర్వాత లారెన్స్ కొరియోగ్రాఫర్ గా చాలా గొప్ప గుర్తింపు సంపాదించుకున్నారు. చిరంజీవి వంటి నటులు కూడా లారెన్స్ కి అవకాశాలు ఇచ్చారు. చిరంజీవి అప్పట్లో చేసిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. స్టైల్ సినిమాతో లారెన్స్ దర్శకుడిగా కూడా కెరీర్ మొదలుపెట్టారు.

అదే సినిమాలో లారెన్స్ నటించారు. ఆ తర్వాత డాన్, కాంచన సిరీస్ లారెన్స్ కి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. లారెన్స్ తను దర్శకత్వం వహించిన సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాల్లో కూడా నటిస్తారు. ఇటీవల చంద్రముఖి 2, జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో లారెన్స్ కి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం లారెన్స్ కొన్ని పాటలకి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించడంతో పాటు, దర్శకుడిగా, నటుడిగా కొనసాగుతున్నారు.

Previous articleOTT లోకి వచ్చిన అంజలి కొత్త సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?
Next articleఓటు వేయడానికి వచ్చిన ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఇలా మారిపోయారేంటి..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.