మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసిన హీరోయిన్ ఎంగేజ్మెంట్ ఫొటోస్…ఎవరో గుర్తుపట్టారా.?

Ads

ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుడ్ నైట్ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించిన విషయం అందరికీ తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతో బాగా ఆదరించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ గుడ్ నైట్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్మార్పీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై వచ్చిన ఈ చిత్రంలో కె. మణికంఠన్, మీతా రఘునాథ్ జోడీగా నటించారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం సౌత్‌ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో మీతా రఘునాథ్ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యింది.

త‌క్కువ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా భారీ విజ‌యం సాధించడం మాత్రమే కాకుండా ఈ ఏడాది హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. నిద్ర, గురక వంటి సాదాసీదా విషయాలను కథా వస్తువుగా తీసుకుని అద్భుతమైన స్క్రీన్ ప్లేగా అభిమానులకు అందించారు దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్. గుడ్ నైట్ సినిమాలో మీతా రఘునాథన్ తన అద్భుతమైన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Ads

2022లో సా నీ నిధూమ్ నీ చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి నటిగా అరంగేట్రం చేసిన ఆమెకు గుడ్ నైట్ చిత్రంతో భారీగా గుర్తింపును తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె నటన చూసిన అభిమానులు తనలాంటి భార్య కావాలని సోషల్ మీడియాలో ఎందరో యూత్‌ మాట్లాడుకునేలా చేసింది. భర్త కోసం దేన్నైనా భరించే భార్యగా ఆమె పాత్ర ప్రేక్షకులను బాగా మెప్పించింది.

ఇది ఇలా ఉంటే మీతాకు పెళ్లి ఫిక్స్ అయింది. తాజాగా ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు షాక్ అవుతారు. ముఖ్యంగా యువత షాక్ అవుతున్నారు. కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ లో షేర్‌ చేసింది. త్వరలో పెళ్లి తేదీని ప్రకటించనుండగా, అభిమానులు మీతాకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే మీతా పెళ్లి ఎప్పుడు అన్న విషయం మాత్రం తెలియడం లేదు.

Previous articleమంగళవారం సినిమా చూసి గూగుల్లో దాని గురించి వెతుకుతున్న నెటిజెన్స్.. అదేంటో తెలుసా?
Next articleమెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? రామ్ చరణ్ కంటే ఎక్కువ సంపాదించారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.