అలాంటి వారు మా వివాహానికి రావద్దు.. వెడ్డింగ్ ఇన్విటేషన్ వైరల్

Ads

పెళ్లి అంటే సంతోషం, సందడి, వినోదం. ఇక హిందూ సాంప్రదాయంలో జరిగే పెళ్లిళ్ళు అయితే భారీగా జరుగుతుంటాయి. వధూ వరుల కుటుంబాలు, వారి బంధువులూ వివాహానికి హాజరవుతుంటారు. అలా వచ్చినవారి మధ్య చిన్న చిన్న గొడవలు, అలకల లాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి.

Ads

కానీ కొన్నిసార్లు ఆ గొడవలు చాలా పెద్దగా మరి పెళ్లి ఆగిపోవడం కూడా చూస్తూ ఉంటాం. ఈ కారణంతోనే గుజరాత్‌ లోని పెళ్లి చేసుకోబోయే జంట ముందు చూపుతో అలాంటి గొడవలు తమ పెళ్లిలో జరగకుండా ఉండాలని వెడ్డింగ్ కార్డు ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఆ వెడ్డింగ్ కార్డు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో వెడ్డింగ్ కార్డు వైరల్‌ అవడం సాధారణం అయిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే, గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌‌కోట్ లో ఉండే హడలా గ్రామానికి చెందినటువంటి మన్సుక్ సీతాపర కుమార్తె పెళ్లి గురువారం నాడు జరిగింది. ఈ పెళ్లి ఇన్విటేషన్ కార్డులో ఒక సూచన ప్రింట్ చేయించారు. అది ఏమిటంటే మద్యం తాగిన వ్యక్తులు తమ పెళ్లికి హాజరు కావొద్దని వెడ్డింగ్ కార్డు తెలిపారు. దాంతో ఈ శుభలేఖ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే వారు ఈ శుభలేఖలో ఇలా ప్రింట్ చేయించడానికి కూడా ఒక కారణం ఉందంట. కొద్ది రోజుల క్రితం వారి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో మద్యం తాగి వచ్చిన బంధువులిద్దరు గొడవ పడ్డారట. ఆ గొడవ కారణంగా ఆ పెళ్లి ఆగిపోయిందట.
తమ ఫ్యామిలిలో జరిగే పెళ్లి వేడుకలో అలాంటి గొడవలు ఉండకూడదనే అలా ప్రింట్ చేయించారంట. అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రంలో మద్య నిషేధం అనేది అమలులో ఉంది. అయినప్పటికి అక్కడ అతిథులు, బంధువులు మద్యం సేవించి పెళ్లి కార్యక్రమాలకు వెళ్తుంటారు. అలా మద్యం సేవించిన వారిని పట్టుకోవడం కోసం పెళ్లి వేడుకలు జరిగే సమయంలో హఠాత్తుగా పోలీసులు రైడ్ చేస్తుంటారు. అందుకే ఇలా శుభలేఖలో రాయడం వల్ల పోలీసుల దాడులు చేస్తారనే భయపడాల్సిన పని లేదని వధువు తండ్రి తెలియచేసారు.
Also Read: రైలు పట్టాల మీద రాళ్ళు ఎందుకు ఉంటాయి..? దాని వెనుక ఇంత పెద్ద కారణమా..?

Previous articleపాము కాటేసినా ముంగిసకు ఏమి కాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?
Next articleనందమూరి తారకరత్నతో సహా మరణించిన ఎన్టీ రామారావు వారసులు వీరే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.