రైలు పట్టాల మీద రాళ్ళు ఎందుకు ఉంటాయి..? దాని వెనుక ఇంత పెద్ద కారణమా..?

Ads

రైలు ప్రయాణం చేయడానికి చాలా బాగుంటుంది దూర ప్రయాణాలను మనం అలసిపోకుండా చెయ్యొచ్చు. అయితే చాలామందికి రైలు మీద వెళుతున్నప్పుడు ఈ సందేహం కలిగి ఉంటుంది. ఎందుకు ట్రాక్ మీద కంకర రాళ్లనే పోస్తారు అని… మీకు కూడా ఎప్పుడైనా ఈ సందేహం కలిగిందా..? ఎందుకు ట్రాక్ మీద కంకర రాళ్ళని వేస్తారు అని దాని వెనుక పెద్ద రీజన్ ఉంది. మరి అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం…

రైలు పట్టాల మధ్య కంకర రాళ్ళను వేస్తారు నిజానికి దీని వెనక సైన్స్ ఉంది. రైల్వే ట్రాక్ కి మధ్యలో వాటికి ఇరువైపులా కూడా ఇలా రాళ్ళను వేయడానికి కారణాలు చాలా ఉన్నాయి.

Ads

  • రైలు చాలా వేగంగా వెళుతూ ఉంటుంది అయితే రైలు వెళుతున్నప్పుడు ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని కంపనాలు ఏమీ రాకుండా ఉండేందుకు వీటిని వేస్తారు. అలానే పెద్ద శబ్దం కూడా ఎవరికీ కలగకూడదని ఈ రాళ్ళను వేస్తారు. అలానే ట్రాక్ కి దగ్గరలో ఉండే భవనాలకి ముప్పు ఉండదు. ఈ రాళ్ళను ట్రాక్ బ్యాలెస్ట్ అని అంటారు.
  • అలానే ఈ రాళ్లు ఉండడం వలన పట్టాల మీద చెట్లు మొక్కలు పెరగవు.
  • వానా కాలంలో కూడా నీరు నిల్వ ఉండిపోకుండా వెళ్ళిపోతుంది. ఒకవేళ కనుక ఈ రాళ్లు లేవంటే ట్రాక్ మొత్తం అంతా కూడా వాన నీటి తో నిండిపోతుంది. అదే ఈ రాళ్లు ఉంటే నీరంతా కూడా ఈ కంకర రాళ్ల మీద నుంచి దగ్గర్లో ఉండే కాలువ లేదా డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది.
  • ఈ రాళ్లు మాత్రమే కాదు పట్టాల మీద కాంక్రీట్ తో చేసిన పొడువాటి ప్లేట్లు ఉంటాయి ఆ ప్లేట్ల మీద ట్రాకులని వేస్తారు. వీటిని స్లీపర్స్ అని పిలుస్తారు. ట్రాక్ బ్యాలెన్స్ లు కూడా ఈ స్లీపర్లకి స్థిరత్వాన్ని ఇస్తాయి. స్లీపర్ బ్యాలెన్స్ రైలు బరువును భరించగలదు అలానే ప్రమాదాన్ని జరగకుండా చూస్తాయి. కంకర రాళ్లు ట్రాక్ మధ్యలో ఉంటే రైలు ఫ్రీగా ముందుకు వెళుతుంది.
Previous article“రంగబలి” మూవీ స్టోరీ, రివ్యూ & రేటింగ్…!
Next articleచాణక్య నీతి: ఇలాంటి వారితో స్నేహం చేస్తున్నారా..? ముంచేసి వెళ్ళిపోతారు… తస్మాత్ జాగ్రత్త..!