Ads
కొన్ని సీరియల్స్ అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కానీ కొన్ని సీరియల్స్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ప్రేక్షకులు అవి సీరియల్స్ అని మర్చిపోయి లీనమైపోయి చూస్తారు. ఇటీవల అలా 2 సీరియల్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అందులో ఒకటి కార్తీకదీపం అయితే, ఇంకొకటి గుప్పెడంత మనసు.
కాలేజ్ లో ఉండే ఒక స్టూడెంట్, పెళ్లి వద్దనుకొని వచ్చి, ఆ తర్వాత తనని తాను ఎలా నిరూపించుకుంది, తన కాళ్ళ మీద ఎలా నిలబడింది అనే ఒక కాన్సెప్ట్ చుట్టూ ఈ సీరియల్ నడుస్తుంది. ఇది రీమేక్ సీరియల్. అంతకుముందు కొన్ని భాషల్లో ఈ సీరియల్ ఆల్రెడీ వచ్చేసింది. తెలుగులో కూడా ఈ కాన్సెప్ట్ ఉన్న సీరియల్ ఆ టైంలో అదే కొత్త అవ్వడంతో చాలా మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంది.
అయితే, గత కొంత కాలం నుండి ఈ సీరియల్ మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ముఖ్య కారణం ఈ సీరియల్ లో రిషి పాత్ర పోషించే ముఖేష్ గౌడ కనిపించకపోవడం. సీరియల్ హీరో అతను. ఒక ఎపిసోడ్ లో కనిపించకపోతే ప్రేక్షకులు ఏమో అనుకున్నారు. కానీ రాను రాను అది ఎక్కువ అయిపోయి చాలా ఎపిసోడ్స్ లో కనిపించట్లేదు. కొన్ని రోజులు కిడ్నాప్ అయ్యాడు అని చెప్పి, కొన్ని రోజులు ఇంకేదో కారణాలు చెప్పి, అతను లేకుండానే పాత సీన్స్ చూపించి సీరియల్ నడిపిస్తున్నారు. దాంతో ముఖేష్ గౌడకి ఉన్న అభిమానుల సంఖ్య ఇంకా పెరిగిపోయింది.
Ads
“రిషి సార్ సీరియల్ లో ఎప్పుడు కనిపిస్తారు?” అంటూ కామెంట్ చేయడం మొదలు పెట్టారు. ముఖేష్ గౌడ సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా ఇదే విషయం మీద కామెంట్స్ చేస్తున్నారు. “మళ్లీ సీరియల్ లోకి మీరు రండి. మీరు లేకపోతే సీరియల్ చూడలేకపోతున్నాం” అంటూ అడుగుతున్నారు. ఇంత క్రేజ్ ఉన్న ముఖేష్ గౌడ రెమ్యూనరేషన్ కూడా మామూలుగా ఉండదు. ముందు ఒక రోజుకి 15000 రెమ్యూనరేషన్ తో కెరీర్ మొదలు పెట్టారు. కానీ ఆ తర్వాత రోజుకి 22000 తీసుకోవడం మొదలు పెట్టారు. ఆయన క్రేజ్ అలాంటిది మరి.
ఇప్పుడు కూడా సీరియల్ లో అంత మంది కనిపిస్తుంటే, వారందరినీ వదిలేసి కనిపించని రిషి సార్ కావాలి అని అభిమానులు అడుగుతున్నారు అంటే ఆయనకి ఉన్న పాపులారిటీ ఎంతో మనమే అర్థం చేసుకోవాలి. కానీ కొంత మంది మాత్రం, “ముఖేష్ గౌడ ఇంకా సీరియల్ లోకి వచ్చే అవకాశాలు లేవు” అని అంటున్నారు. మరి కొంత మంది మాత్రం, “బ్రేక్ తీసుకున్నారు” అని, “వస్తారు” అని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే సీరియల్ బృందం నుండి ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.