అన్న‌మ‌య్య చిత్రంలో వెంక‌టేశ్వ‌ర స్వామి పాత్ర‌ను చేజార్చుకున్న హీరోలు ఎవ‌రో తెలుసా..?

Ads

అక్కినేని నాగార్జున విక్ర‌మ్ చిత్రంతో ఇండస్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆడియెన్స్ ని అల‌రించారు. అక్కినేని నాగేశ్వరరావు వార‌సుడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికి నాగార్జున త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను, ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్నారు. ఆయన తన కెరీర్ లో ఎక్కువ‌గా లవ్ స్టోరి  సినిమాలలో న‌టించి మ‌న్మ‌థుడుగా పేరు తెచ్చుకున్నాడు.

అయితే నాగార్జున ప్రేమ‌క‌థ మరియు మాస్ చిత్రాలే కాకుండా భక్తిర‌స చిత్రాలలోనూ న‌టించి విజయాన్ని అందుకున్నాడు. అక్కినేని నాగార్జున అన్న‌మయ్య చిత్రం ద్వారా కుటుంబ ప్రేక్షకులకు బాగా ద‌గ్గ‌ర‌ అయ్యాడు. ఈ చిత్రంలో నాగార్జున వెంక‌టేశ్వ‌రు స్వామి భ‌క్తుడు అయిన అన్న‌మ‌య్య పాత్రలో నటించాడు. ఈ క్యారెక్టర్ లో నాగార్జ‌న అద్భుతమైన న‌ట‌న అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో వెంక‌టేశ్వ‌రు స్వామి క్యారెక్టర్ లో సుమ‌న్ న‌టించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మూవీలో వెంక‌టేశ్వ‌ర స్వామి పాత్ర కోసం ముందుగా అనుకున్నది సుమ‌న్ కాదంట.ఈ చిత్రంలో చాలా సన్నివేశాలలో అన్న‌మయ్య స్వామివారి పాదాల పై ప‌డి, మొక్కాల్సి ఉంటుంది. అందువల్ల మొదట్లో వెంక‌టేశ్వ‌ర స్వామి పాత్ర కోసం సీనియ‌ర్ అగ్ర హీరోను తీసుకోవాల‌ని మూవీ యూనిట్ అనుకుందంట. దాంతో ఈ పాత్ర‌ కోసం సీనియర్ హీరో శోభ‌న్ బాబును సంప్రదించారంట. అయితే ఆయ‌న చేయలేనని చెప్ప‌డం ఇష్టం లేక పారితోషికంగా 50 ల‌క్ష‌లు అడిగారంట. దాంతో మూవీ యూనిట్ స్టార్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఈ పాత్ర కోసం అడిగారంట. అయితే స్టార్ హీరో అటు వంటి క్యారెక్టర్ క‌నిపిస్తే ఫ్యాన్స్ ఎలా స్వీక‌రిస్తారో అనే సందేహంతో దర్శకుడు రాఘ‌వేంద్ర‌రావు అక్కడితో ఆగిపోయారంట.

Ads

హీరో సుమ‌న్ అయితే వెంక‌టేశ్వ‌ర స్వామి క్యారెక్టర్ కి సెట్ అవుతాడాని ఆయ‌న‌ను అడిగారంట. సుమ‌న్ వెంటనే ఒకే చెప్పడంతో ఆయనేనే ఫిక్స్ చేసి, షూటింగ్ పూర్తి చేశారంట. ఈ చిత్రం అద్బుతమైన విజయాన్ని సాధించింది. ఇక వెంక‌టేశ్వ‌ర స్వామిగా సుమ‌న్ త‌న పాత్ర‌కు వంద శాతం న్యాయం చేశారు.
Also Read: ప్రీ ఆస్కార్స్ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ధర ఎంతంటే?

Previous articleగుప్పెడంత మనసు సీరియల్ హీరో “ముఖేష్ గౌడ” రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! ఒక్క ఎపిసోడ్ కి ఇంత తీసుకుంటారా..?
Next article1940 నాటి కరెంటు బిల్ చూసారా.? నెలకి ఎంతనో తెలుసా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.