Ads
గురు గ్రహం లేదా బృహస్పతి.. అనుగ్రహం ఉంటే ఏ రాశి వారి కైనా అన్నివేళలా మంచి జరుగుతుంది అంటారు. అలాంటి బృహస్పతి ప్రతి రాశిలో సంచరిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం బృహస్పతి మేషరాశిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ నాలుగవ తారీఖున గురు గోచారం మొదలైంది. అంటే మేష రాశి లో బృహస్పతి తిరోగమనాన్ని వక్రగతి అంటారు. అయితే ఈ వక్రగతి అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మే 1 2024 లో తిరిగి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు.
అయితే ప్రస్తుతం గురు గోచారం కారణంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కోబోతున్న ఆ ఐదు రాశుల గురించి తెలుసుకుందాం…
మేష రాశి
మేష రాశి వారు ఈ సమయంలో అనవసరమైన గొడవల జోలికి పోకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున గొడవలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఇక వీరిపై పని ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది.
Ads
సింహరాశి
నిర్ణయాలు తీసుకునే ముందు సింహ రాశి వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవడం ఉత్తమం. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు ఎంతో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
వృషభ రాశి
ఈ రాశి వారికి కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడులు, వ్యాపారాలు లాంటివి ఇప్పుడు ప్రారంభించకపోవడమే ఉత్తమం. ఈ రాశి వారు చేసిన మంచి పనులు ఎప్పుడు వీరిని కాపాడుతూ ఉంటాయి.
కర్కాటక రాశి
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయే ఆస్కారం ఉంది. భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత ప్రశాంతంగా ఉండాలి. అన్ని విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవడం ఎంతో ఉత్తమం.