7g బృందావన్ కాలనీ పాటలో డాన్స్ చేసిన అమ్మాయి ఎవరు.? “కాజల్” అంటూ వైరల్ చేస్తున్నారు.?

Ads

తెలుగు ఇండస్ట్రీలో గత ఏడాది నుండి రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. పాత చిత్రాలను 4కె లోకి మార్చి వాటిని థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ ట్రెండ్ పోకిరి సినిమాతో మొదలయ్యింది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాని రీరిలీజ్ చేశారు.

ఆ మూవీకి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో వరుసగా పాత సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కల్ట్ క్లాసిక్ మూవీగా పేరు గాంచిన 7జి బృందావన్ కాలనీ రీరిలీజ్ అయ్యింది. 2004 లో విడుదల అయిన 7 జి బృందావన్ కాలనీ సినిమా అప్పట్లో కుర్రకారుని ఈ సినిమా ఓ ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ సినిమా టెంప్లేట్ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటాయి.

ఈ సినిమాను టాప్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో రవికృష్ణ హీరో గా నటించగా, సోనియా అగర్వాల్ హీరోయిన్ నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే.. ఈ సినిమా తరువాత రవి కృష్ణ పెద్దగా క్లిక్ కాలేదు.

“7 జి బృందావన్ కాలనీ” సూపర్ సక్సెస్ అవడంతో హీరో రవి కృష్ణకు చాలానే ఆఫర్స్ వచ్చాయి. ఈ సినిమాతో రవిక్రిష్ణకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. కానీ, సరిగ్గా సినిమాలు ఎంచుకోవడంలో రవి కృష్ణ విఫలం అయ్యారు. దానితో ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వడమే కాకుండా తరువాత అవకాశాలు కూడా రాలేదు. తన సినిమా కెరీర్ లో రవి కృష్ణ ఎనిమిది సినిమాలలో నటించారు. కానీ వాటిల్లో, “7 జి బృందావన్ కాలనీ” సినిమా తప్ప మరే ఇతర సినిమా హిట్ అవ్వలేదు.

Ads

కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిన ఈ సినిమాని ఇప్పటికి టీవీలలో ప్రసారం అయితే చూడటానికి ఇష్టపడతారు. 7జి బృందావన్ కాలనీ రీరిలీజ్ కోసం మూవీ యూనిట్ ప్రమోషన్లు చేసింది. హీరోయిన్ సోనియా అగర్వాల్ తో పాటు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు.

ఇది ఇలా ఉండగా…ఈ సినిమాలో ఒక పాటకి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అదేంటంటే, సినిమాలో హీరో ఇంట్రడక్షన్ పాట అయిన మేం వయసుకు వచ్చాం లో హీరో పక్కన ఒక అమ్మాయి డాన్స్ వేస్తూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు టాప్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ అని మీమ్స్ వేస్తున్నారు. ఏంటి కాజల్ ఈ పాటలో డాన్స్ చేసిందా అంటూ వైరల్ చేస్తున్నారు.

watch video:

అయితే ఆ అమ్మాయి కాజల్ కానీ కాదు…ఎందుకంటే కాజల్ ఒక హిందీ సినిమాలో ఐశ్వర్యా రాయ్ ఫ్రెండ్ గా నటించాక డైరెక్ట్ తెలుగులో హీరోయిన్ గానే నటించారు. అయితే మరికొంతమంది ఏమో…ఆ అమ్మాయి హీరోయిన్ “కేథరిన్” అంటున్నారు. కొంత మంది అయితే, “అసలు ఆ అమ్మాయి హీరోయిన్ కానే కాదు. కేవలం ఒక డాన్సర్ మాత్రమే” అని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో.

Previous articleఇది 18 సంవత్సరాలు పైబడిన వారు చదివితే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే..?
Next articleగురు గోచారం వల్ల ప్రమాదంలో ఉన్న 4 రాశులు ఇవే…వీరు తప్పక జాగ్రత్తగా ఉండాలి..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.