Ads
ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. కొంత మందికి చేతులు, కాళ్లు, పాదాల మీద వెంట్రుకలు ఉంటూ ఉంటాయి. అలానే కాలి బొటన వేలు మీద కూడా వెంట్రుకలు ఉంటాయి. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఈ వెంట్రుకలని బట్టి గుండె ఆరోగ్యం ఉంటుందట. మీ కాళ్ళ కి కూడా వెంట్రుకలు ఉన్నాయా..? ఒక సారి చూసుకోండి.
ఈ రెండింటికి మధ్య ఉండే సంబంధాన్ని ఇప్పుడు చూద్దాం. వెంట్రుకలు పెరిగేందుకు పోషకాలు అవసరం అవుతాయి. వెంట్రుకలు చర్మం లోపల నుండి స్టార్ట్ అవుతాయి.
Ads
అయితే ఇవి పెరిగేందుకు రక్తం కావాలి. రక్తం అవసరం ఉంటేనే ఎదగడానికి అవుతుంది.
ఇలా వెంట్రుకలు ఏర్పడతాయి. వెంట్రుకలు కణాలు నిర్మాణం అయ్యే కొద్దీ పెరుగుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అయితేనే శరీరంలో వెంట్రుకలు మొలుస్తాయి. అయితే కాలి వద్ద బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక పోతే వెంట్రుకలు మొలవవు. ఒకవేళ కనుక బ్లడ్ సర్క్యులేషన్ అయితే వెంట్రుకలు మొలుస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేసే నాళాలైన ధమనుల్లో ఆటంకం కలిగితే బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. మనం తినే ఆహారం వలన ఏర్పడే కొవ్వు ధమనుల్లో చేరుతుంది.
ఒకవేళ ఇది ఎక్కువైతే రక్తం సరఫరా కాదు. ఈ కారణం వలన వెంట్రుకలు పెరగవు. మరి చేతులు భాగానికి కూడా లింక్ ఉందా అనేది చూస్తే.. చేతులు గుండెకు దూరంగా వుండవు. దగ్గరగా ఉంటాయి. కానీ గుండె కి కాలి బొటన వేలు చాలా దూరంగా ఉంటుంది. సో మనం దీన్నే లెక్క లోకి తీసుకోవాలి. కాలి బొటన వేలు మీద వెంట్రుకలు ఎక్కువ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతున్నట్టు.