“ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశారు..? చూసుకోవాలి కదా..?” అంటూ… “భోళా శంకర్” సినిమాపై కామెంట్స్..!

Ads

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్‘ మూవీ భారీ అంచనాల నడుమ గత సంవత్సరం ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ గా విడుదల  అయింది. మెహర్ రమేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, చిరంజీవి పక్కన హీరోయిన్ గా తమన్నా నటించింది. హీరోయిన్ కీర్తి సురేశ్ చెల్లెలిగా నటించింది.

Ads

గత సంవత్సరం రిలీజ్ అయిన ఈ చిత్రానికి అంతగా టాక్ రాలేదు. చిరంజీవి ఈ మూవీ కోసం ఎంత కష్టపడినా మెహర్ రమేశ్ దర్శకత్వం పై ఘాటు విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో మీమ్స్ తో ఈ మూవీని ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ల నుండి  తెలుగులో తవ హీరోగా కొనసాగుతున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాలలో భారీ డిజాస్టర్ గా నిలిచిన మూవీ ‘ఆచార్య’.  ఈ మూవీ తర్వాత ఆ రేంజ్​లో  ‘భోళా శంకర్’ పై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ మూవీ పైనే ట్రోల్స్​ కనిపిస్తున్నాయి. ఆడియెన్స్, నెటిజన్లు ఈ మూవీని ఓ రేంజ్​లో ఆడుకుంటున్నారు.
అసలు మూవీలో మెగాస్టార్​ చిరంజీవికి రేంజ్​కు తగిన సన్నివేశాలు లేవని, క్రింజీగా ఉందని నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో జబర్దస్త్ నటుల ​ కామెండీ కానీ, శ్రీముఖి నడుము సన్నివేశం ​సెట్ కాలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీమర్స్ అయితే భోళా శంకర్ మూవీలోనీ సీన్స్ ను రకరకాల మీమ్స్ ను తయారు చేసి సోషల్ మీడియాలో​ ట్రోల్ చేస్తున్నారు.scene in bholaa shankarజాతిరత్నాలు అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఈ మూవీలోనీ కీర్తి సురేష్ ఫోటోను షేర్ చేసి, అదేంటి ఏదో డీవీడీ ప్లేయర్ కి కనెక్ట్ చేసినట్టు ఆ వైర్లు ఏంటి అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీలో ఆమెకు తలకు సర్జరీ చేసినట్టు చూపించారు. కానీ ఆమెకు హెయిర్ తీయలేదని, పైగా తలకు వైర్లు పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.

Previous articleఏ భార్యా కూడా ఈ 4 విషయాలని భర్తకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పదు..!
Next article1940 నాటి కరెంటు బిల్ చూసారా.? నెలకి ఎంతనో తెలుసా.?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.