Ads
ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని నటుడు. అది పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా కేవలం తన ఎన్టీఆర్ హీరో అన్న మాట వింటే చాలు ఆడియెన్స్ థియాటర్ కు తరలివస్తారు. వెండి ధరపై కథానాయకుడు.. అసలైన మేటి నటుడుగా విశ్వవిఖ్యాతిగాంచిన నటసార్వభౌముడు ఎన్టీఆర్. సినీ రంగమైన.. రాజకీయమైన..తెలుగు వాడి ఆత్మ గౌరవం నిలబెట్టే వ్యక్తి ఆంధ్రుల అన్న….ఎన్టీఆర్.
అటువంటి నటుడికి నటవారసులుగా వెండితెరకు పరిచయమైన బాలకృష్ణ, హరికృష్ణ నటనలో తండ్రికి తామేమి తీసుకోమని నిరూపించుకున్నారు.
బాలకృష్ణ చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి తన మార్కు నటనతో ప్రేక్షకులు ఎంతో ముద్దుగా బాలయ్య బాబు అని పిలిచే స్థాయికి చేరుకున్నారు, అయితే హరికృష్ణ గారు మాత్రం అడపాదడపా సినిమాలు చేశారు. కానీ అతి తక్కువ సినిమాలతో కూడా ప్రేక్షకాదరణ పొంది తను నటనకు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు.
అందరి కొడుకుల్లో కంటే రామారావు గారికి హరికృష్ణ అంటే ఎంతో ఇష్టం. హరికృష్ణ ఏది చెప్పినా కాదనుకుండా చేసేవారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానం దగ్గర నుంచి రాజకీయ ప్రచారం వరకు ప్రతి క్షణం హరికృష్ణ అతనికి నీడలా మేదిలేవాడు. అయితే హరికృష్ణకు కాస్త కోపం ఎక్కువైనట. ఒకసారి సినిమా థియేటర్ కట్టాలి అని హరికృష్ణ అడిగినప్పుడు…ఈ విషయంలో ఎన్టీఆర్ తన ఆప్త మిత్రుడు నాగేశ్వరరావు సలహా తీసుకున్నారు.
Ads
సినిమాలోనే కాకుండా వ్యాపార విషయంలో కూడా మంచి దిట్ట అయిన నాగేశ్వరరావు ..థియేటర్ కడితే పెద్దగా లాభాలు ఉండవు కావాలంటే మంచి స్టూడియో కట్టండి అని సలహా ఇచ్చారు. నాగేశ్వరరావు వ్యాపార దక్షత పై ముందుచూపుపై ఎంతో నమ్మకం ఉన్న ఎన్టీఆర్ కూడా అదే మంచిది అని ఆలోచించి వెంటనే స్టూడియో పనులు మొదలుపెట్టారు.
అయితే తాను థియేటర్ కట్టాలి అని చెబితే తన మాట పక్కన పెట్టి స్టూడియో కట్టడానికి పూనుకున్న తండ్రి వైఖరి పై హరికృష్ణకు కోపం వచ్చింది. అంతే ఇంకేముంది ఇంత చిన్న విషయానికి తండ్రితో రెండు సంవత్సరాలు మాటలు కట్ చేసేసాడు హరికృష్ణ. హరికృష్ణ వైఖరి తెలుసు కాబట్టి విషయం తెలిస్తే తానే సర్దుకుంటాడు అని ఎన్టీఆర్ కూడా మౌనంగా ఉండి పోయారట. అయితే ఆ తర్వాత దూర దృష్టితో ఆలోచించి థియేటర్ బదులు స్టూడియో కట్టారు అని తెలుసుకున్న హరికృష్ణ కోపం తగ్గి మళ్లీ మునుపుట్టిన తండ్రితో మాట్లాడడం మొదలుపెట్టారు.