Ads
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో హీరోగా నటిస్తూ దర్శకత్వంలో, స్టోరీస్ రాయడంలో పట్టున్నవాళ్లు తక్కువగానే ఉన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ హీరో అడవి శేషు ఒకరని చెప్పవచ్చు.
Ads
తెలుగు సినీ పరిశ్రమలో హీరో అడివి శేష్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. శేషు ప్రయోగత్మక చిత్రాలలో నటించడమే కాకుండా ఆ చిత్రాల కమర్షియల్ విజయాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మిడ్ రేంజ్ హీరోలలో శేషుకి సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది. అడివి శేష్ కు జోడీగా నటించడానికి యంగ్ హీరోయిన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే కెరీర్ మొదట్లో పెద్దగా స్కోప్ లేని క్యారెక్టర్స్ లో నటించిన శేష్, ప్రస్తుతం ఆడియెన్స్ ని థ్రిల్ చేసే సినిమాలను ఎంపిక చేసుకుంటూ విజయవంతంగా కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. అడివి శేష్ కి స్టోరీస్ పై మంచి అవగాహన ఉండడడంతో పాటుగా, డైరెక్షన్ పై కూడా పట్టు ఉంది. ఇక అతని నటనకి వంక పెట్టడానికి లేదు. తనకున్న టాలెంట్ ని ఉపయోగించి తన కెరీర్ కి తానే బాటలు వేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆడియెన్స్ ఎలాంటి కథలను ఆదరిస్తారనే విషయాన్ని అర్థం చేసుకుని, అలాంటి చిత్రాలనే చేస్తూ కొనసాగుతున్నాడు.
క్షణం సినిమాతో మొదలైన అడివి శేష్ ప్రభంజనం గూడచారి, ఎవరు, మేజర్, హిట్ 2 వరకు సాగుతూనే ఉంది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్ లు చేశాడు. తన కథలను తానే ఎందుకు రాసుకుంటున్నాను అనేదానికి కారణాన్ని వివరించాడు. టాలీవుడ్ లో ఒకే కుటుంబం నుండి పదిమంది దాకా హీరోలు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ 20 స్క్రిప్ట్ లే ఉన్నాయి. అలాంటప్పుడు హీరోకు మూడో లేదా నాలుగో ఫ్రెండ్ గా మాత్రమే ఛాన్స్ లు వస్తాయి. హీరోగా ఛాన్స్ రావడం చాలా కష్టం. దానివాల్లే నా సినిమాలకి నేనే సొంతంగా కథలను రాసుకుంటున్నానని తెలిపాడు.
Also Read: అప్పటి స్టార్ హీరోలలో పారితోషికం ఎవరు ఎక్కువ తీసుకునేవారో తెలుసా?