Ads
ఇటీవల కాలంలో ఏది నిజమైన నోటో ఏది నకిలీ నోటు అనేది గుర్తు పట్టడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే అచ్చం నిజమైన నోటులాగే నకిలీ నోట్లను కొందరు తయారు చేస్తున్నారు.
Ads
అంతేకాకుండా కొన్ని దేశాలు ఇండియా ఆర్ధిక వ్యవస్థను టార్గెట్ చేసుకోవడం వల్ల కూడా ప్రస్తుతం దేశంలో నకిలీ కరెన్సీ రోజు రోజుకి పెరుగుతుంది. ఎంతగా అంటే చివరికి ఏటీఎం మెషీన్స్ లో కూడా నకిలీ కరెన్సీ వచ్చేంతగా. నోటును నిశితంగా పరిశీలిస్తే తప్ప అది నిజమైన నోటా లేకపోతే నకిలీ నోటా అని తెలియని పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో నకిలీ నోట్లతోనే బయట చాలా రకాల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఏటీఎంలో కూడా నకిలీ నోట్లు వస్తున్నాయని వార్తలు వింటూనే ఉన్నాము.ఏటీఎంలో నుండి డబ్బులు విత్ డ్రా చేసుకునేప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. చాలా మంది ఇప్పటికే ఏటీఎంలో నకిలీ నోట్లు వచ్చాయని అంటున్నారు. అయితే అలా ఏటీఎంలో నకిలీ నోట్లు వచ్చినప్పుడు ఏం చేయాలనే విషయం ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కొందరికి అవగాహన లేకపోవడంతో వారు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఏటీఎంలో నకిలీ నోట్లు వస్తే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఇలా వచ్చినపుడు ఏంచేయాలో ఆర్బీఐ వివరించింది. ఎవరైకి అయితే ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకున్నప్పుడు వాటిలో నకిలీ నోట్లు వస్తే, ఎలాంటి టెన్షన్ పడకుండా, ఆ నకిలీ నోటును అదే ఏటీఎంలో ఉండే సెక్యూరిటీ కెమెరాకు చూపించి, ఆ తర్వాత ఏటీఎం బయట ఉన్న సెక్యూరిటీ గార్డుకు తెలియజేయాలి. అంతేకాకుండా ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేసినప్పుడు వచ్చిన లావాదేవీల స్లిప్ తీసుకుని బ్యాంక్ కు వెళ్ళి, లిఖిత పూర్వక ఫిర్యాదుతొ పాటుగా లావాదేవీల స్లిప్ కుడా జత చేసి ఇవ్వండి. ఆ తరువాత బ్యాంక్ ఇచ్చే అక్నలెడ్జిమెంట్ తీసుకోవాలి. బ్యాంకు ఆ విషయం పై విచారణ జరిపి, నకిలీ నోటు తీసుకుని వేరే నోటు ఇస్తారు.
Also Read: రైలు నెంబర్ లో వుండే ఐదు అంకెలు ఏమిటి..? ఇంత అర్ధం ఉందని మీకు తెలుసా..?