ఈ ఫోటోలో లేడీ గెటప్ లో ఉన్న యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఏ సినిమా కోసం అంటే..?

Ads

సినిమాల కోసం హీరోలు ఎన్నో చేస్తారు. ఫైటింగ్ చేస్తారు, డాన్సులు చేస్తారు, డైలాగ్స్ చెప్తారు, కొత్త రకమైన కాస్ట్యూమ్స్ కూడా వేస్తూ ఉంటారు. అయితే, కొన్ని సార్లు పాత్ర డిమాండ్ చేస్తే, పాత్ర కోసం వీటన్నిటికంటే ఎక్కువ చేయాల్సి వస్తుంది. కొత్త మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ మార్చుకోవడం లాంటివి కూడా చేస్తుంది. ఇవన్నీ కాకుండా ఒక్కొక్కసారి గెటప్ కూడా మారుస్తారు. అంటే, హీరో ఒక్కొక్కసారి లేడీ గెటప్ కూడా వేస్తారు. అలా చేసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు.

hero in lady get up

వాళ్లలో ఇప్పుడు ఒక యంగ్ హీరో కూడా చేరారు. ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా? ఇటీవల ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ హీరో నటించడం మాత్రమే కాకుండా, నిర్మాతగా వ్యవహరించడం, దర్శకత్వం కూడా చేయడం వంటివి చేస్తారు. ఈ హీరో మరెవరో కాదు. విశ్వక్ సేన్. పోల్చుకోవడానికి కష్టంగా ఉంది కదా? పాత్ర కోసం అంతగా మారిపోయారు. విశ్వక్ సేన్ లైలా అనే ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ ఈ గెటప్ వేశారు.

Ads

ఈ సినిమాకి రామ్ నారాయణ దర్శకత్వం వహిస్తుండగా, సారు గారపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. తనిష్క్ బాగ్చీ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ లుక్ కూడా ఇవాళ విడుదల చేశారు. కొంత మంది ఈ సినిమా, ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ సినిమా రీమేక్ అని అంటున్నారు. కానీ పోస్టర్ లో ఇచ్చిన కొన్ని వివరాలు చూస్తూ ఉంటే, ఆ సినిమా రీమేక్ అయ్యే అవకాశం ఇది లేదు అని అంటున్నారు.

హీరో లేడీ గెటప్ లో విలన్స్ ని పట్టుకుంటారు ఏమో అని అంటున్నారు. ఏదేమైనా కూడా ఈ సినిమా మీద ఆసక్తి మాత్రం నెలకొంది. ఇంకా తెలియాలి అంటే ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇవాళ విడుదల చేసిన పోస్టర్ లో ఫిబ్రవరి 14, 2025 లో ఈ సినిమా విడుదల అవుతుంది అని ప్రకటించారు. షూటింగ్ కూడా మొదలు అవుతుంది అని ఇందులో ఇచ్చారు

Previous articleసైలెంట్ గా రిలీజ్ అయ్యి… 395 కోట్లు వసూలు చేసింది..! ఈ సినిమా గురించి తెలుసా..?
Next articleవారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్ పాటిస్తున్న నియమాలు ఏంటి..? ఈ దీక్ష యొక్క విశిష్టత ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.