వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్ పాటిస్తున్న నియమాలు ఏంటి..? ఈ దీక్ష యొక్క విశిష్టత ఏంటంటే..?

Ads

నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 26వ తేదీ అంటే బుధవారం నుండి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. పవన్ కళ్యాణ్ సాధారణంగా ఎప్పుడు తెలుపు వస్త్రాల్లోనే కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాల్లో కనిపిస్తున్నారు. ఇందుకు కారణం, పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు దీక్షలో ఉంటారు. దీక్ష ఎంతో నియమనిష్ఠలతో చేస్తారు. గత మంగళవారం విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలకి శాసనసభ వ్యవహారాల మీద అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు.

pawan kalyan varahi ammavari deeksha in 2024

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని శాసనసభ వ్యవహారాలని, ఆ సభలో పాటించే నియమావళిని కూడా తెలిపారు. గత సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ జూన్ సమయంలోనే వారాహి విజయయాత్ర చేపట్టినప్పుడు వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం అమ్మవారి ఆశీస్సులు పొందడానికి పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టారు. దీక్ష జూన్ 26వ తేదీ బుధవారం నుండి మొదలుపెట్టారు. కాబట్టి ముందు రోజు ఆయన మంగళవారం రోజు దీక్ష వస్త్రాలు ధరించినా కూడా, దీక్ష నియమాలు మాత్రం రేపటినుండి పాటించాల్సి ఉంటుంది.

Ads

ఈ దీక్షలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పాలు, పండ్లతో పాటు, ద్రవహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఈ దీక్ష జరిగిన 11 రోజులు కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర సంక్షేమం కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలి అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టారు. పవన్ కళ్యాణ్ కి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. రాజకీయ వ్యవహారాల్లో, సినిమా వ్యవహారాల్లో తలమునకలై ఉన్నా కూడా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఎన్నో ప్రత్యేక పూజలు కూడా పవన్ కళ్యాణ్ చాలా సార్లు నిర్వహించారు. ప్రజల కోసం, వారు బాగుండటం కోసం, పవన్ కళ్యాణ్ పూజలు చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాగే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షని చేపట్టి 11 రోజులు నియమ నిబద్ధతతో ఈ దీక్షను పాటిస్తారు.

Previous articleఈ ఫోటోలో లేడీ గెటప్ లో ఉన్న యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఏ సినిమా కోసం అంటే..?
Next articleచెల్లెలి పెళ్లి ఆగిపోయింది… భార్య వదిలేసి వెళ్ళిపోయారు..! రచనలతో సంచలనం సృష్టించిన ఈ వ్యక్తి గురించి తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.