కళ్యాణ్ దేవ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. దాని గురించేనా?

Ads

మెగా స్టార్ చిరంజీవి కూతురు శ్రీజతో ఆమె భర్త కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకుంటున్నాడని రూమర్స్ వస్తున్న నేపధ్యంలో కళ్యాణ్ దేవ్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది.

Ads

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ముందుగా శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పరల్లీ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆ తరువాత వీరు విడాకులు తీసుకుని విడిపోవడంతో, చిరంజీవి ఫ్యామిలీ శ్రీజకి రెండో పెళ్లి కళ్యాణ్ దేవ్ అతనితో పెళ్లి జరిపించారు. అయితే కళ్యాణ్ దేవ్ కి కూడా ఇది రెండవపెళ్ళి. అనంతరం కళ్యాణ్ దేవ్ సినిమాల్లో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో విజేత అనే మూవీతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా విజయం పొందలేదు. అయినా కూడా నటుడిగా కళ్యాణ్ దేవ్ కి మంచి మార్కులు పడ్డాయి.
సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలతో ఆడియెన్స్ ని పలకరించారు. వీటిలో కిన్నెరసాని మూవీ ఓటీటీ జీ 5 లో రిలీజ్ అయ్యింది. సూపర్ మచ్చీ చిత్రం ధియేటర్లలో సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. అయితే మూవీ ప్రమోషన్స్ లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరు కూడా కనిపించలేదు. ఇక అప్పటినుండి శ్రీజ కళ్యాణ్ దేవ్ లపై చర్చలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరిని ఒకరు ఫాలో అవకపోవడంతో విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి.
బయట ఎన్ని వార్తలు వస్తున్న మెగా డాటర్ శ్రీజ ‌,కళ్యాన్ దేవ్ ఈ విషయం పై సైలెంట్ గానే ఉన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు ఇద్దరు. ఎన్నో రకాలుగా ప్రచారాలు జరుగుతున్నా, వీరి మధ్య ఏం జరిగిందనేది మాత్రం బయటకు తెలియట్లేదు. ఇక ఈక్రమంలో తాజాగా కల్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో ఓపికగా ఉండండి. అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అని రాసుకొచ్చారు. దేనిని ఉద్దేశించి ఇలా పెట్టారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read: యాక్టర్ సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా?ఈ ఫోటోలపై ఓ లుక్ వేయండి..

Previous articleవాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలలో సంక్రాంతి బరిలో గెలిచే మూవీ ఏది?
Next articleఇవివి సత్యనారాయణ కుమారుడు ఆర్య‌న్ రాజేష్ పెళ్లి చలపతి రావు ఎందుకు జరిపించారు..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.