Ads
సినీ పరిశ్రమలో వారసత్వం అనేది చాలా సాధారణమైన విషయం. సక్సెస్ అయిన హీరోల, నటుల కుటుంబం నుండి ఫామిలి మెంబర్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. అలా వచ్చిన వారిలో కొంతమంది తమ ప్రతిభతో విజయాన్ని పొంది కెరీర్ లో కొనసాగుతూ ఉంటారు.
Ads
కానీ కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే కనుమరుగు అవుతూ ఉంటారు. అలా వచ్చిన వారు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అలా రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి కూడా ప్రభాస్ తన చిత్రాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఆయన సినిమాకి, సినిమాకి వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటూ, ప్రతి మూవీకి తనని తాను చేంజ్ చేసుకుంటూ కొనసాగుతూ ఉన్నారు.
మిర్చి చిత్రం వరకు ఒకేలా ఉన్నటువంటి ప్రభాస్, జక్కన్న తెరకెక్కించిన బాహుబలి మూవీ కోసం చాలా కష్టపడ్డాడు. ఇక బాహుబలి క్యారెక్టర్ లో ఆయనను తప్ప ఇంకోకరిని ఊహించుకోలేము. అంత అద్భుతంగా నటించారు. అయితే కృష్ణంరాజు ఫ్యామిలీ నుండి ప్రభాస్ కాకుండా ఆయన తర్వాత ఇంకొక హీరో కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ హీరో కూడా ప్రభాస్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్న తర్వాతే ఎంట్రీ ఇచ్చాడు.అలా వచ్చిన హీరో ఎవరంటే సిద్ధార్థ్ రాజ్‌కుమార్. ఇక సిద్ధార్థ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి కజిన్. అంటే ప్రభాస్ పిన్ని కొడుకు. అతను ‘కెరటం’ అనే మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. సిద్ధార్థ్ రాజ్‌కుమార్, రకుల ప్రీత్ సింగ్ ఇద్దరికీ ఇది మొదటి సినిమా.
అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సిద్ధార్థ్ ఈ మూవీ తరువాత యువన్, ఆ ఐదుగురు అనే చిత్రాలలో నటించారు. కానీ అవి కూడా విజయం పొందలేదు. ఆ తరువాత అతను నటించలేదు. ప్రస్తుతం సిద్ధార్థ్ రాజ్‌కుమార్ ఏక్కడ ఉన్నారని కానీ, ఏం చేస్తున్నారనే విషయం ఎవరికి తెలియదు.
Also Read: బాలయ్య చెప్పిన ”కత్తితో కాదురా, కంటి చూపుతో చంపేస్తా” అనే డైలాగ్ ను ఎవరి దగ్గర నుండి కాపీ చేశారంటే..