పాతాళ బైరవి నుండి పోకిరి వరకు.. 10 ఇండస్ట్రీ హిట్స్ ను రిజెక్ట్ చేసిన 10 మంది హీరోలు ఎవరో తెలుసా?

Ads

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో వద్దన్న స్టోరీని మరో హీరో ఒకే చేయడం సహజం. దర్శకులు చెప్పిన కథ చెప్పినప్పుడు ఆ కథ నచ్చకపోవడం వల్లనో, లేదా డేట్స్ కుదరక పోవడంతో వారికి వచ్చిన అవకాశాన్ని రిజెక్ట్ చేస్తుంటారు కొందరు హీరోలు. మరి కొందరు తాము ఆ చిత్రానికి లేదా ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వమని సున్నితంగా తిరస్కరిస్తుంటారు.

Ads

అయితే అలా కొందరు హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరీస్ తో వేరే హీరోలు ఇండస్ట్రీ హిట్ అందుకున్నవాళ్ళు ఉన్నారు. ఇక ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ప్రతి హీరో, ప్రతి దర్శకుడు మరియు హీరోల అభిమానులు కూడా ఎంతగానో కోరుకుంటారు. తమ కెరీర్ లో ఒక్క ఇండస్ట్రీ హిట్ కొట్టినా చాలు అని అనుకుంటారు. మరి అలాంటి 10 ఇండస్ట్రీ హిట్స్ ను వదులుకున్న 10 మంది తెలుగు స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1.పాతాళబైరవి: 
ఈ సినిమా ఎన్టీఆర్ ని స్టార్ గా నిలబెట్టిన సినిమా. అయితే ఈ మూవీలో ముందుగా అనుకున్నది అక్కినేని నాగేశ్వర రావు. ఆయన అప్పటికే తెలుగులో టాప్ హీరోగా ఉన్నారు. కీలుగుర్రం తరువాత ఆయన వద్దకి   చాలా జానపద సినిమాలు వస్తుంటే వదులుకున్నారు. వాటిలో పాతాళబైరవి ఒకటి. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.
2.దేవదాసు: 
విచిత్రంగా ఈ సినిమా ముందు వెళ్ళింది ఎన్టీఆర్ దగ్గరికి ఆయన అప్పటికి స్టార్ హీరోగా బిజీగా ఉన్నారు. డేట్స్ కుదరక పోవడం, అలాగే ఆయనకు తాగుబోతులా  నటించడం ఇష్టం లేకపోవడంతో రిజెక్ట్ చేశారు. ఈ సినిమాలో నటించి  అక్కినేని నాగేశ్వర రావు ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.
3.అడవిరాముడు:
ఈ మూవీని శోభన్ బాబుతో చేయాలనుకున్నారు. కానీ ఆయన డేట్స్ కుదరక పోవడంతో ఆయనే ఎన్టీఆర్ పేరు సూచించడంతో ఎన్టీఆర్ వద్దకి వెళ్ళి కథ చెప్పగానే ఆయన ఒకే అన్నారు. ఈ సినిమాతో ఆయన మరో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు.
4.పసివాడి ప్రాణం:
విట్నెస్ అనే ఆంగ్ల సినిమా ఆదారంగా కృష్ణ, శ్రీదేవి, చిన్నప్పటి మహేష్ బాబుతో ఇస్ ఇనిమాని ప్లాన్ చేశారు. అయితే ఇదే సినిమా ఆధారంగా తమిళంలో ఒక సినిమా హిట్ అవడం ఆ సినిమా అల్లు అరవింద్ చూసి రైట్స్ కొనడం జరిగాయి. అయితే ఈ మూవీ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తడం చివరికి కృష్ణ ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి చిరంజీవి స్టార్ హీరోగా మారారు.
5.గ్యాంగ్ లీడర్:
ఈ మూవీలో  ముందుగా అనుకున్నది నాగబాబుని, ‘అరే ఓ సాంబ’ అనే పేరుతో బాపినీడు దర్శకత్వంలో చేయాలనుకున్నారు. అదే సమయంలో చిరంజీవి బాపినీడు కాల్ చేసి డేట్స్ ఉన్నాయి సినిమా చేద్దాం అన్నారంట. ఆయన దగ్గర ఈ కథ మాత్రమే ఉండడంతో అదే చెప్పడం ఆయన ఒకే చెప్పడం జరిగాయి, ఆ విషయం నాగబాబుకి చెప్పడంతో ఇది అన్నాయకే సెట్ అవుతుంది అన్నాడంట. అలా గ్యాంగ్ లీడర్ తో చిరంజీవి మరో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.
6.చంటి
తమిళంలో వచ్చిన  చిన్నతంబీ మూవీని రవి రాజాపినిశెట్టి రాజేంద్ర ప్రసాద్, కుష్బూ లతో తీయాలని అనుకున్నారంట. కానీ సురేష్ బాబు వెంకటేష్ తో చేయాలని అనుకున్నారు. చివరికి చంటి సినిమాతో వెంకటేష్ స్టార్ హీరోగా మారాడు.
7.సమరసింహ రెడ్డి:
ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ సినిమాలో ముందుగా అనుకున్నది వెంకటేష్ ని, అయితే ఆయన ఈ స్టోరీ తనకు సెట్ అవదని చెప్పారు. దానితో బాలయ్యకు చెప్పడం ఆయన ఒకే చేయడం జరిగాయి, అలా ఈ మూవీతో బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.
8.కలిసుందాం రా:
ఉదయ శంకర్ తెలుగులో దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఇందులో ముందుగా నాగార్జునను అనుకున్నారు. ఆయన డేట్స్ కుదరక పోవడంతో వెంకటేష్ దగ్గరికి వెళ్ళింది. ఈ మూవీతో వెంకటేష్ మరో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.
9.నువ్వే కావాలి:
కొట్టా హీరో హీరోయిన్స్ తో  చిన్న సినిమాగా వచ్చి, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ముందుగా హీరోగా సుమంత్ ని అనుకున్నారట, ఆ సమయంలో ఆయన చాలా సినిమాలను రిజెక్ట్ చేశారంట. వాటిలో ఇది ఒకటి.
10.పోకిరి:
పోకిరి సినిమా ప్రభంజనం గురించి అందరికి తెలిసిందే. అప్పటి దాకా ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నీటిని తిరగ రాసింది. అయితే పూరీ ముందుగా రవితేజతో చేద్దామని అనుకున్నారు. ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సర్దార్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ డేట్స్ క్లాష్ అవడంతో రవితేజ ఈ మూవీని తరువాతఆ చేద్దాం అన్నారంట. దాంతో ఆయన మహేష్ బాబుని కలవడం కొన్ని మార్పులు చేసి పోకిరీ పేరుతో విడుదల చేశారు. అలా మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.

Also Read: ఈ 4గురు దర్శకుల కుమార్తెలు ఏం చేస్తున్నారో తెలుసా?

Previous articleప్రభాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో ఎవరో? అతను నటించిన చిత్రాలు ఏమిటో తెలుసా?
Next articleకుక్కల వెంటపడినప్పుడు.. ఇలా చేసినట్లయితే మీ ప్రాణాలను రక్షించుకోవచ్చు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.