డబ్బుల విషయంలో చాలా మంది మోసం చేశారు.. హీరోయిన్ ల‌య‌

Ads

ఒకప్పుడు టాలీవుడ్ లో అందం, అభినయంతో మాయ చేసిన కథానాయకలు ప్రస్తుతం ఫ్యామిలీ జీవితాన్ని గడిపుతున్నారు. వారిలో కొందరు హీరోయిన్స్ సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించి సినిమాలలో బిజీగా ఉన్నారు. ఇంకొందరు హీరోయిన్స్ వారి పూర్తి సమయాన్ని కుటుంబానికి వెచ్చిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ లో లయ ఒకరు.

లయ స్వయంవరం మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటనపరంగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించి మెప్పించింది. ఇక నటిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత యాక్టింగ్ కు దూరంగా ఉన్నారు లయ. అయితే ఆమె కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. రీల్స్, ఫోటోషూట్స్, తన డ్యాన్సులతో లయ ఆకట్టుకుంటున్నారు. తాజాగా లయ ఒక ఇంటర్వ్యూలో  ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
హీరోయిన్ ల‌య‌ ఇలా చెప్పుకొచ్చారు. తాను మొదటి నుండి చాలా సాఫ్ట్ అని, దాంతో చాలామంది డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలిపారు. మిగతా అందరికి డబ్బులు ఇచ్చేవారని, తనకు ఇచ్చేవారు కాదని తెలిపారు. ఆ సమయంలో మిగతావారు మీరు గట్టిగా అడగండి అని త‌న‌కు చెప్పేవారని అన్నారు. ఒకసారి అయితే షూటింగ్ కు రెడీ అయ్యాను కానీ వాళ్లు డబ్బు గురించి ఇబ్బంది పెడుతుండడంతో  ఆ షూటింగ్ కు వెళ్లకుండా ఉన్నానని చెప్పారు.
అప్పడే మ నాన్న కాల్ చేయడంతో అమ్మ  విషయం చెప్పగానే ఆయన కోపంగా చేసిన పనికి డబ్బులు అడిగితే తప్పుకాదని, కానీ పని మానేయకూడదని చెప్పారు. దాంతో ఆ తరువాత మళ్ళీ అలా చేయలేదని వెల్లడించారు. ఇక డబ్బులు అడిగినపుడు కొంతమంది తరువాత సినిమాలో చూద్దాం అనే చెప్పేవారు. కానీ నెక్ట్స్  సినిమాలో తనను కాకుండా వేరే వారిని తీసుకున్నారని చెప్పారు.
ఇక డబ్బులు అడిగినపుడు కొంతమంది తరువాత సినిమాలో చూద్దాం అనే చెప్పేవారు. కానీ నెక్ట్స్  సినిమాలో తనను కాకుండా వేరే వారిని తీసుకున్నారని చెప్పారు. అయితే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అలాంటి సమయంలో కొంచెం బాధగా అనిపించేదని అన్నారు. ఇక యూట్యూబ్ లో తనపై ఏవేవో రాస్తూ పోస్టులు చేస్తున్నారని, అలా వస్తున్నవాటిలో ఏ మత్రం వాస్తవం లేదని సీనియర్ ల‌య‌ తెలిపారు.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమాకి ముందుగా ఏ టైటిల్‌ అనుకున్నారో తెలుసా?

Ads

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)

Previous articleమంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి ఎలా ఉందో? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Next articleఅక్కినేని, మంచు కుటుంబాలకి ఆ విషయంలో కలిసి రావడం లేదా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.