పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమాకి ముందుగా ఏ టైటిల్‌ అనుకున్నారో తెలుసా?

Ads

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటించిన సూప‌ర్ హిట్ సినిమాలలో ఖుషి మూవీ ఒక‌టి. ఎస్.జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా త‌మిళ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.

Ads

ఒరిజినల్ మూవీకి డైరెక్షన్ చేసిన ఎస్ జె సూర్యనే ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నిర్మాతగా ఏ ఎం రత్నం వ్యవహరించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా హీరోయిన్ భూమిక న‌టించింది. ఈ సినిమా విజయంతోనే భూమికకు స్టార్ హీరోయిన్ గా మారింది. రొమాంటిక్ ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రం యువతను ఊహించని విధంగా ఆకట్టుకుంది. వేసవి కానుకగా 2001లో ఏప్రిల్ 27న ఖుషి మూవీ రిలీజ్ అయ్యింది.
ఇక మొదటి షో నుండే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ప‌వ‌న్ కళ్యాణ్ భూమిక మధ్య నడిచిన కెమిస్ట్రీ అందరిని ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ఈ మూవీలోని న‌డుము సన్నివేశం ఎక్కువగా ఆక‌ర్షించింది. ఈ రొమాంటిక్ సీన్‌ కి యూత్ బాగా క‌నెక్ట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఏడవ సినిమాగా రిలీజ్ అయిన ఖుషి కలెక్షన్ల వర్షం కురిపించింది. దాంతో ఈ మూవీ ప్రొడ్యూసర్లు, బయ్యర్లు బాగా లాభపడ్డారు. పవర్ స్టార్ మార్కెట్ ఈ చిత్రం తర్వాత అమాంతం పెరిగింది. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇనిసిడెంట్ బయటకు వచ్చింది. ఖుషి సినిమాకి ముందుగా ‘చెప్పాలనివుంది’ అనే టైటిల్ ను అనుకున్నార‌ట‌. అయితే ఆ టైటిల్ కన్ఫర్మ్ చేసిన తరువాత క్యాచీగా ఉండాలని అనుకుని ఈ చిత్ర మేక‌ర్స్ ఆ టైటిల్‌ని పక్కన పెట్టి ఖుషీ అనే టైటిల్ ను పెట్టారు. హీరోయిన్ గా భూమిక కంటే ముందు అమిషాపటేల్ ను తీసుకున్నారంట. కొన్ని సీన్స్ తీసిన తరువాత భూమికను హీరోయిన్ గా తీసుకున్నారంట.
అలా పక్కన పెట్టిన ‘చెప్పాలనివుంది’ పేరుని హీరో వ‌డ్డే న‌వీన్ తన సినిమాకి ఉపయోగించుకున్నాడు. ఈ చిత్రానికి చంద్ర మహేష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వడ్డే నవీన్, రాశి హీరో హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ చిత్రం ఆడియెన్స్ ని అంతగా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇక ఈ రెండు సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదల అవడం విశేషం. 2001లో ఖుషి మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ అవగా, వడ్డే నవీన్ హీరోగా తెరకెక్కిన చెప్పాలనివుంది ఆగస్టు నెలలో రిలీజ్ అయ్యింది. వీటిలో ఖుషి సినిమా సంచలన విజయం సాధించగా, చెప్పాల‌ని ఉంది మూవీ తీవ్రంగా నిరాశ‌పర‌చింది.
Also Read: సీనియర్ హీరో శోభ‌న్ బాబు తన కొడుకును హీరోగా చేయ‌లేదు.. ఎందుకంటే?

Previous articleముఖేష్ అంబానీ కారు డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Next articleజాన్వీ కపూర్ దగ్గర ఉన్న 12 అత్యంత ఖరీదైన వస్తువులు ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.