Ads
టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ నటి రాధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు రాదా అని గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా అలరించిన రాధ ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.
ఈమె తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. పెళ్లి తర్వాత తన భర్త వ్యాపారాలను చూసుకుంటూ బిజీ బిజీగా మారిపోయింది.
ఇది ఇలా ఉంటే ఇటీవలే తెలుగులో ముగిసిన ఒక డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యింది రాధ. కాగా నటి రాధా పెద్ద కూతురు కార్తీక్ నాయర్ వివాహాన్ని చాలా ఘనంగా చేశారు. పెళ్లి వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఈ పెళ్లి వేడుకలలో భాగంగా కార్తీక వేసుకున్నటువంటి నగలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈమె ఒంటి నిండా భారీ స్థాయిలో నగలను వేసుకొని కనిపించారు. ఆ వివాహం కేరళ సాంప్రదాయం ప్రకారం కేరళలోని ఒక రిసార్ట్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
Ads
ఈ పెళ్లి వేడుకలకు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇలా పెళ్లి వేడుకలలో కార్తీక అందంగా ముస్తాబవడమే కాకుండా పెద్ద ఎత్తున నగలు వేసుకోవడంతో వీరికి ఎంత మొత్తంలో ఆస్తులు ఉన్నాయనే విషయం గురించి వార్త వైరల్ గా మారింది. రాధ భర్త వ్యాపారంగంలో కొనసాగుతూ ఉండటంతో పాటు వీరికి ఇండియాలోనే కాకుండా దుబాయ్ లో కూడా హోటల్ బిజినెస్ లో ఉన్నాయట. ఇలా రాధా తన భర్త సంపాదన ఆస్తులు అన్ని మొత్తం కలిపి 300 కోట్లకు పైగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక రాధ కుమార్తె కార్తీక కూడా బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ALSO READ : స్టార్ హీరోలతో సినిమాలు… అయినా గుర్తింపు రావట్లేదు..! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?