ఈ ఫోటోలో ప్రశాంత్ తో పాటు ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

Ads

ఇప్పుడు అంటే తెలుగు హీరోయిన్స్ రావడం తక్కువగా అవుతోంది. గత కొంత కాలం వరకు తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువగా వచ్చారు. ఇప్పుడు కాలం మారింది. తెలుగు హీరోయిన్స్ వస్తున్నారు. గతంలో అయితే తెలుగు హీరోయిన్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ కూడా ఒక తెలుగు హీరోయిన్. తెలుగు ఆమె మాతృభాష. కానీ ఆమె తమిళ సినిమాల్లో కూడా నటించి చాలా ఫేమస్ అయ్యారు. రోజా సెల్వమణి. అచ్చ తెలుగు హీరోయిన్.

heroine with prashanth

తమిళ హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్న సమయంలో, తెలుగు రాష్ట్రాల నుండి రోజా హీరోయిన్ గా అడుగు పెట్టి, స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఫోటోలో రోజాతో పాటు ఉన్న హీరో ప్రశాంత్. ఇది తమిళ్ లో రోజా మొదటి సినిమా. ఈ సినిమా పేరు చెంబరుతి. ఈ సినిమాకి రోజా భర్త సెల్వమణి దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా అగ్ర హీరోలు అందరితోనూ రోజా నటించారు. మధ్యలో కొంత కాలం బ్రేక్ తీసుకున్న రోజా, గోలీమార్ సినిమాలో నటించారు. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన వీర సినిమాలో కూడా నటించారు. అప్పుడు మళ్లీ కొంత కాలం బ్రేక్ తీసుకున్నారు.

Ads

జబర్దస్త్ ప్రోగ్రాంలో జడ్జ్ గా అడుగు పెట్టారు. ఎన్నో సంవత్సరాలు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ లో కొనసాగారు. ఈ ప్రోగ్రామ్స్ రోజాని తెలుగువారికి ఇంకా చేరువ చేశాయి. రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా ప్రోగ్రామ్స్ కి దూరం అయ్యారు. రోజా తెలుగులో 2013 లో వచ్చిన శ్రీ జగద్గురు ఆది శంకర సినిమాలో లక్ష్మీదేవిగా నటించారు. తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించారు. కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. మోడ్రన్ మహాలక్ష్మి ప్రోగ్రాంకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. అలా సినిమాలు, సీరియల్స్, టీవీ షోస్ కూడా రోజా చేశారు.

Previous articleమనిషి రోబోతో ప్రేమలో పడితే… పెళ్లి వరకు వెళ్తే..? ఈ సినిమా చూశారా..?
Next articleపుష్ప పాట శ్రేయ ఘోషల్ ని మించిపోయి పాడింది కదా..? వైరల్ అవుతున్న ఈ వీడియో చూశారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.