Ads
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైనటువంటి ఘట్టం. కానీ అందరి విషయాల్లో ఇది సుఖమయం అవుతుంది అన్న గ్యారంటీ లేదు.. భాగస్వాములు మధ్య ఆలోచనలు ,నిర్ణయాలు సరిపడనప్పుడు పని రకాల సమస్యలు తలెత్తుతాయి. ఇది పెరిగి పెద్దవయ్య కొద్దీ క్రమంగా విడాకులు తీసుకునే వరకు వెళ్తాయి.
ఎంత సర్దుకుపోదామని చూసినా కొన్ని సందర్భాలలో పొంతన కుదరదు కాబట్టి సర్దుకు పోలేని పరిస్థితుల్లో జంటలు విడాకులు తీసుకుంటాయి. మామూలుగా సంసారం అంటే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది సర్దుకుపోవాలి అని కొంతమంది అంటూ ఉంటారు.. కానీ కొంతమంది మాత్రం కలిసి బతక లేనప్పుడు విడిపోవడమే ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు. ఇప్పటికీ ఈ విషయంపై ఎవరికీ స్పష్టత లేదు కనుక ఎప్పుడూ దీని గురించి ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉంటాయి.
Ads
అయితే మన చట్టం ప్రకారం జంట కలిసి ఉండలేని పరిస్థితుల్లో చట్టబద్ధంగా విడిపోయే ఆస్కారం ఉంది. కానీ విడాకులు కావాలి అంటే కొన్ని పద్ధతులు అనుసరించి తీరాల్సిందే. ప్రతి చిన్న కారణానికి విడిపోతామంటే కుదరదు.. చట్టపరంగా కేవలం కొన్ని కారణాలకు మాత్రమే విడాకులు ఇస్తారు. మానసికంగా వేధించడం, కొట్టడం లాంటి హింసాత్మకమైన కారణాలకు తక్షణమే విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది.
భార్య కానీ భర్త కానీ వారి భాగస్వామిని అవమానించి, కించపరిచి మానసికంగా వేధిస్తే.. అలాంటి వారికి కచ్చితంగా విడాకులు మంజూరు చేస్తారు. మానసిక వేదన అనేది క్రూరత్వం కిందకే వస్తుంది. విడాకులు ఎటువంటి కారణాలపై మంజూరు చేస్తారో మరింత క్షుణ్ణంగా తెలియాలి అంటే కింద వీడియోను కచ్చితంగా చూడండి…
watch video: