“నాగ చైతన్య” విషయంలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది.? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.?

Ads

అక్కినేని హీరో నాగచైతన్య సమంత ప్రేమ వివాహం, ఆ తరువాత డైవర్స్ విషయం అన్ని సంచలనాలగానే మిగిలాయి. లవ్ లో ఉన్నప్పుడు వాళ్లపై ఎన్ని రూమర్స్ వచ్చేవో విడిపోయాక అంతకంటే ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. పైగా ఇద్దరిలో ఎవరు ఏమి చేసినా డైవర్స్ మ్యాటర్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు. ఇదే క్రమంలో సమంత రీసెంట్ గా నటించిన ఖుషి చిత్రానికి సంబంధించి కూడా ఒక రూమర్ ని స్ప్రెడ్ చేశారు.

నాగచైతన్య ,సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయం ఎవరికీ స్పష్టత లేదు. ఇక ఆ తర్వాత నుంచి ఇద్దరికీ సంబంధించిన వ్యక్తిగత జీవితమైనా ,వృత్తిపరమైన విషయమైనా ప్రతిదీ ఏదో ఒక రకంగా వార్తల్లో వైరల్ అవుతూనే ఉంది. అయితే వాళ్ళిద్దరూ మాత్రం ఎవరి కెరియర్ లో వాళ్ళు బాగా బిజీగా ఉన్నారు.

Ads

తాజాగా సమంత నటించిన ఖుషి మూవీకి సంబంధించిన ఒక విషయానికి నాగచైతన్య చాలా హర్ట్ అయ్యాడని…సినిమా హాల్లో ఖుషి ట్రైలర్ చూసి తట్టుకోలేక బయటకు వచ్చేసాడని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. రెండు రోజుల నుంచి ఈ వార్త బాగా వైరల్ కూడా అయింది. సుప్రియ యార్లగడ్డ…. నాగచైతన్య ,సమంత డైవర్స్ విషయంలో ఈమె పేరు కూడా పలుసార్లు వార్తల్లో వచ్చింది.

సుప్రియ నిర్మాణంలో రీసెంట్ గా విడుదలైన బాయ్స్ హాస్టల్ ప్రీమియర్ షోలో పాలుపంచుకున్న నాగచైతన్య.. షో మధ్యలో ఖుషి సినిమా ట్రైలర్ రాగానే కోపంతో బయటకు వచ్చాడు అనేది వార్తల సారాంశం. అయితే రీసెంట్ గా ఒక ఇంగ్లీష్ పేపర్ ఇంటర్వ్యూలో నాగచైతన్య ఈ న్యూస్ పై స్పందించడం జరిగింది. కావాలని ఇలాంటి రూమర్స్ సృష్టించారే తప్ప తాను థియేటర్ నుంచి బయటకు వచ్చాను అనేది ఫేక్ న్యూస్ అని నాగచైతన్య స్పష్టం చేశారు.

అంతేకాకుండా ఇలా తప్పుడు వార్తలు ప్రచురించిన ఆ సదరు మీడియా ఆ వార్తలను సరి చేసుకోవాలి అని కూడా సూచించారు. నాగచైతన్య సమంత విడిపోయినప్పటినుండి ఎందుకు వ్యూస్ కోసం ఇలాంటివి వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.? కేవలం నాగచైతన్య విషయంలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది.? ఎందుకు ఇలా టార్గెట్ చేసి వార్తలు రాస్తున్నారు.?

Previous articleఈ ఫోటోలో ఉన్న ఒకప్పటి పాపులర్ హీరో ఎవరో గుర్తుపట్టారా..?
Next articleహిందూ వివాహ చట్టం ప్రకారం…కేవలం ఇలాంటి కారణాలకే విడాకులు మంజూరు చేస్తారు అంట.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.