Ads
ఒక హోటల్ కి వెళ్లి మంచి కాఫీ తాగితే ఇంచుమించు వంద రూపాయలు బిల్ అవుతుంది. మంచి టిఫిన్ చేయాలంటే కనీసం 200 కావాలి, అదే కడుపునిండా భోజనం చేయాలంటే కచ్చితంగా 300 నుంచి 400 ఉండాల్సిందే.
కానీ ఒకప్పుడు ఇదే ఫుడ్ కేవలం 26 రూపాయలు కి వచ్చేసేది. నిజమేనండి, 1985 డిసెంబర్ 20 నాటి హోటల్ బిల్ ఒకటి సోషల్ మీడియాలో చూసిన భోజన ప్రియులు షాక్ అవుతున్నారు.
ఎందుకంటే నేడు అదే బిల్ వందలు కొన్ని హోటల్స్ లో అయితే వేలు అవుతుంది. ఇంతకీ ఈ బిల్ విషయం ఏమిటో చూద్దాం. ఈమధ్య ఢిల్లీలోని లజపతి నగర్ లో ఉండే లజీజ్ రెస్టారెంట్ 1985 డిసెంబర్ 20 నాటి రెస్టారెంట్ బిల్లుని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ బిల్లుని చూసినవారు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ బిల్లులో చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ బిల్ మాత్రం 26 రూపాయలు అయింది. ఇంతకీ సదరు వ్యక్తి ఏమి ఆర్డర్ ఇచ్చాడు వాటి ఖరీదు ఎంత చూద్దాం.
Ads
ఒక ప్లేట్ దాల్ మఖనీ, షాహి పన్నీర్, రైతా, మరియు కొన్ని చపాతీలు. ఇందులో దాల్ మఖని, షాహి పన్నీర్ కలిపి ఎనిమిది రూపాయలు బిల్లు అయితే మిగిలిన రైతా రోటీలు కలిపి 11 రూపాయలు. అప్పట్లో రెస్టారెంట్ బిల్లు రేటు ఇలా ఉంటే ఇంకా మిగిలిన గ్రోసరీస్ వాల్యూ ఇంకా ఎంత తక్కువగా ఉండేదో అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
ఆ 26 రూపాయలతో ఇప్పుడు కనీసం ఒక చిప్స్ ప్యాకెట్ కూడా రాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ పోస్టు 2013 ఆగస్టు 12న ఫేస్ బుక్ లో షేర్ చేస్తే ఇప్పుడు వైరల్ అవ్వటం విశేషం. నేటి యూత్ అయితే ఆ రోజులలో వస్తువుల విలువ తక్కువ, డబ్బుల విలువ ఎక్కువ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా పాత జ్ఞాపకాలని తలుచుకోవడం నిజంగా ఒక ఆనందం. కదా.