పెళ్లిలో వధువుతో స్టాంప్ పేపర్ లపై సంతకం చేయించుకున్న వరుడి ఫ్రెండ్స్..! ఎందుకంటే..?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన వేడుక. అందువల్ల తమ వివాహాన్ని అంగరంగ వైభవంగా చేసుకోవాలని భావిస్తారు. ఆర్థిక పరిస్థితులను బట్టి, తమకు ఉన్నంతలో పెళ్లి గ్రాండ్ గా జరుపుకుంటారు.

పెళ్ళిలో జీవితాంతం కలిసి బ్రతుకుతామని, కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని వధూవరులు ఇద్దరు అగ్నిసాక్షిగా ప్రమాణం చేయడం అనేది తెలిసిందే. కానీ తమిళనాడులో జరిగిన పెళ్లిలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

తమిళనాడులోని మధురైకి చెందిన హరిప్రసాద్‌ తేనీలోని ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తున్నాడు. ‘సూపర్‌స్టార్‌’ అనే క్రికెట్ క్లబ్‌కు హరిప్రసాద్‌ కెప్టెన్‌. అతనికి పూజ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు బంధువులు వచ్చి, నూతన దంపతులను ఆశీర్వదించారు. కానుకలు అందచేశారు. కానీ పెళ్లికుమారుడి స్నేహితులు స్టాంప్ పేపర్ తీసుకునివచ్చి, పెళ్లికూతురిని  తమ స్నేహితుడిని పెళ్లి చేసుకోవాలంటే ఆ ఒప్పందం పై సంతకం చేయాలని అడిగారు.
విషయం విని ఆశ్చర్యపోయిన వధువు పూజ ఆ ఒప్పందంలోని విషయాన్ని పూర్తిగా చదివి, నవ్వుతూ ఆ ఒప్పందంపై సంతకం చేసింది. సూపర్ స్టార్ క్రికెట్ జట్టుకు హరిప్రసాద్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. అతని స్నేహితులు కూడా క్రికెట్ ఆడుతుంటారు. ప్రతి శని, ఆదివారాల్లో వీరంతా కలిసి ప్రాక్టిస్ చేస్తుంటారు. వారి ఫ్రెండ్ హరి ప్రసాద్ కు పెళ్లి జరుగుతుందని తెలియడంతో పెళ్లి తరువాత అతను క్రికెట్ ఆడడం కోసం రాడేమో అని ఫ్రెండ్స్ భావించారు.
అందుకే బాగా ఆలోచించి, హరిప్రసాద్ ను పెళ్లి తరువాత కూడా క్రికెట్ ఆడించేందుకు వధువుతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. పెళ్ళికి వెళ్తూ 20 రూపాయల స్టాంప్ పేపర్లను కూడా తీసుకెళ్లారు. వీటిని పెళ్లి కూతురికి ఇచ్చి, సంతకం చేయాలని కోరారు. పేపర్లలో ఉన్న విషయాన్ని చదివిన వధువు  ఆనందంగా అంగీకరించింది. ఆ పేపర్స్ పై ‘నా భర్తను శని, ఆదివారాల్లో క్రికెట్ ఆడడానికి అనుమతిస్తాను’ అని రాసి, సంతకం పెట్టింది. పెళ్లి తరువాత ఆ స్టాంప్ పేపర్లతో కలిసి వధూవరులు, వారి ఫ్రెండ్స్  ఫొటోలు దిగారు. అప్పట్లో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Also Read: స్వాతంత్ర పోరాటం సమయం నాటి పెళ్లి ఆహ్వాన పత్రిక… పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.!

Previous articleఆడింది 5 మ్యాచులే… కానీ ఇప్పుడు భారత బౌలర్ల విజయం వెనక ఉన్నది ఆయనే..!
Next articleఈ పండు తింటున్నట్టు కల వచ్చిందా.? అయితే మీకు ఆ కోరిక నెరవేరుతుంది అని మాట.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.