పూర్వం ఎలా హెయిర్ కట్, షేవింగ్ చేసుకునేవారు..? పరికరాలు లేవు కదా ఏం చేసేవారు..?

Ads

రోజులు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ రోజుల్లో మనకి ప్రతీది ఈజీ అయిపోయింది సదుపాయాలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ మధ్య కాలం లో అయితే మరీను. అయితే ఎప్పుడైనా మీకు ఈ ప్రశ్న కలిగిందా ? పూర్వికులు గడ్డాలు ఎలా కత్తిరించుకునే వారు అని. ఈ రోజుల్లో బ్లేడ్లు, రేజర్లు, ట్రిమ్మర్లు ఇలా చాలా వచ్చాయి. మరి అప్పటి వాళ్ళు ఎలా షేవింగ్ చేసుకునే వారు..? షేవింగ్ కి సంబంధించి ఎటువంటి పరికరాలు ఉండేవి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

  1. 30,000 BC కి ముందు పెయింటింగ్ లను చూస్తే మగవారు గడ్డాలు లేకుండా కనపడ్డారు. గడ్డాలని తొలగించేందుకు అప్పట్లో మగవాళ్ళు పదునైన రాళ్ళని ఉపయోగించే వారు. పదునైన రాళ్లను రుద్ది, గుండ్రంగా ఉంచేసి తరవాత రెండు ఓస్టెర్లను కలిపి ట్వీజర్ తయారు చేస్తారు. అలా గడ్డం ని మార్చేవారు. అవాంఛిత రోమాలను తీసేందుకు క్లామ్ షెల్ ను వాడేవారు.
  2. ఇప్పుడు కూడా చాలా చోట్ల మగవారు పదునైన రాళ్ళని గడ్డాలని కత్తిరించేందుకు వాడుతున్నారు.
    ఈజిప్ట్ సివిలైజేషన్ లో అయితే గడ్డాలు ని కత్తిరించేందుకు మెటల్ ని ఉపయోగించడం మొదలు పెట్టారు.
  3. తర్వాత మధ్య యుగాలలో పురుషులు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు గడ్డాలని ఉంచుకునేవారు. బ్రిటిష్ రాజు హెన్రీ VII గడ్డం పెంచుకునేవారు. కానీ హెన్రీ VIII కి గడ్డం లేదు.
  4. 1769 లో ఫ్రెంచ్ బార్బర్ జీన్-జాక్వెస్ పెరెట్ ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ టు షేవ్ సెల్ఫ్ ను ప్రచురించాడు. రేజర్ బ్లేడ్లను ఉంచేందుకు షేవ్ చేసినప్పుడు గాయాలు వంటివి అవ్వకూడదని చెక్క గార్డుతో పెర్రెట్ రేజర్ ని కనుగొన్నారు.
  5. క్రీస్తుపూర్వం 1800 లో స్టీల్ రేజర్లు వచ్చాయి. వీటినీ గడ్డం తీసే ముందు రుద్దాల్సి వచ్చేది.
    1895 లో కింగ్ జిల్లెట్ డిస్పోజబుల్ రేజర్ బ్లేడ్లను కనుగొన్నారు. వీటిని విక్రయించడం కూడా మొదలు పెట్టారు.
  6. కానీ ఇప్పుడు ఈజీగా షేవింగ్ చేసుకోవచ్చు. సెలూన్లు వచ్చాయి అలానే ట్రిమ్మర్లు వంటివి కూడా వచ్చేసాయి.
Previous articleఇవి ఫ్రిడ్జ్ లో పెడితే ఇక విషం కన్నా ప్రమాదం… తెలుసా..?
Next articleతెలంగాణాలో అధికారమే లక్షంగా పక్కా ప్రణాళికతో దూసుకెళుతున్న కాంగ్రెస్ !