Ads
సినిమాలో నటించే నటీ నటులు అందంగా కనపడడానికి.. హుందాగా కనపడడానికి వివిధ రకాల దుస్తులు ధరిస్తూ ఉంటారు. నిమిషానికి ఒక డ్రెస్ మారుస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో అంత డబ్బులు పెట్టి అన్ని దుస్తులని మనం కొనుగోలు చేయలేము. సినిమాల్లో కూడా ఖరీదైన దుస్తుల్ని కొనడం కష్టమే.
సినిమాలో నటి నటులు దుస్తులని సన్నివేశానికి తగ్గట్టుగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అందంగా కనపడడానికి ఒక రకం బట్టలు వేసుకుంటే.. సాదాగా కనపడడానికి కామన్ గా ఉండే దుస్తులు ఎంపిక చేసుకుంటూ ఉంటారు.
ఎక్కువగా హీరో హీరోయిన్లు బ్రాండెడ్ బట్టల్ని వేసుకుంటూ ఉంటారు. ఈ దుస్తులని కొనుగోలు చేస్తే ఖరీదు ఎక్కువ అవుతుంది కాబట్టి అద్దెకి తీసుకొని వస్తూ ఉంటారు. లేకపోతే నటి నటులు వాళ్ళ సొంత దుస్తుల్ని ఒక్కొక్కసారి తెచ్చుకుంటూ ఉంటారు. సినిమాలో సన్నివేశాన్ని బట్టి ఒక్కొక్క సారి మురికిగా ఉండే బట్టలను వేసుకోవాల్సి వస్తుంది. మరి అటువంటప్పుడు బట్టలను బురద లో ముంచుతారా..? లేదంటే ఇంకేం చేస్తారు..? బురదలో ముంచిన తర్వాత ఆ బట్టలను మళ్లీ నటులు వేసుకుంటారా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
Ads
మీకు కూడా ఆ సందేహం కలిగే ఉంటుంది. దుస్తులని మురికిగా కనపడేందుకు దర్శకులు ఒక టెక్నిక్ ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి పుష్ప సినిమా చూస్తే అందులో ఉండే నటులు ఇలాంటి బట్టల్ని వేసుకుంటారు. డీ గ్లామర్ లుక్ లో కనపడాలంటే ఇలానే ఉండాలి. అయితే ఇలా మరకలు రావడానికి టీ లేదా కాఫీ లోని బట్టల్ని ముంచుతారు. తర్వాత వాటిని ఆరబెడతారు ఇలా ఆరబెట్టిన దుస్తుల్ని నటీనటులు వేసుకుంటారు. ఈ విషయంను సుకుమార్ గతంలోనే చెప్పారు. అంతే కానీ దుస్తుల్ని బురదలో వెయ్యడం లేదంటే మట్టి వేయడం లాంటివి చెయ్యరు. ఇలా ఈజీగా టీ లేదా కాఫీ లో వేసి వీటిని ఆరబెడతారు. ఇలాంటి దుస్తుల్ని డీ గ్లామర్ లుక్ కోసం నటులు వేసుకుంటూ వుంటారు.