Ads
హిందూ శాస్త్రాల ప్రకారం జ్యోతిష్యం ప్రతి మనిషి జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని విషయాలను ముందుగానే సూచిస్తుంది అని నమ్ముతారు. ప్రతి మనిషి పుట్టిన వెంటనే జాతక చక్రం వేయించడం మనకు అలవాటు. 9 గ్రహాలు ఈ జాతక చక్రంలో ఉన్న స్థానాన్ని బట్టి ఆ శిశువు యొక్క జాతకం నిర్ణయించబడుతుంది. ముఖ్యంగా ఈ జాతకాలలో ముందుగా మనం తెలుసుకునేది ఏమన్నా దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని. ఇలా చాలామందికి భయం కలిగించే ఒకానొక జాతక దోషం కుజదోషం.
కుజ గ్రహం వక్రంచడం వల్ల కలిగే కుజదోషం మనిషి జీవితంలో ఎన్నో ఆటంకాలు కలిగిస్తుంది అని నమ్ముతారు అందులో మొదటిది పెళ్లి ఆలస్యం కావడం ..రెండవది సంతానం ఆలస్యం కావడం. కుజదోషం ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం ద్వారా ఈ సమస్య తీరిపోతుంది అంటారు. అసలు ఇంతకీ కుజదోషం అంటే ఏమిటి? దానివల్ల మన జీవితం పై పడే ప్రభావం ఎటువంటిది? ఈ దోష నివారణకు ఎటువంటి పూజలు చేయాలి? అనే విషయాన్ని తెలుసుకుందాం..
Ads
కుజుడు అంటే అంగారక గ్రహం.. మన రాసి చక్రంలో అంగారకుడు 1, 2, 4, 8, 12 పాదాలలో ఉన్నట్లయితే ఆ జాతకుడికి కుజదోషం ఉంది అని అంటారు. కానీ మళ్ళీ మంగళవారం జన్మించిన వారికి ఈ దోషం నుంచి మినహాయింపు ఉంటుంది. అంగారక గ్రహం మన జాతకం పై ఎంతో ప్రభావం చూపిస్తుంది అని జ్యోతిష్య పండితుల నమ్మకం. అంగారకుడు ఆత్మ గౌరవం, శక్తి కి ప్రతీకగా పరిగణిస్తారు. కుజుడి ప్రభావం కేవలం పెళ్లి పైనే కాకుండా మానసిక ఆరోగ్యం మరియు ఆర్థిక సమస్యలపై కూడా ఉంటుంది.
కుజదోషానికి మన శాస్త్రాల ప్రకారం అనేక పరిష్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా అంగారకుడికి అధిపతి అయినటువంటి సుబ్రమణ్య స్వామిని మంగళవారం పూట పూజించడం ద్వారా కుజదోషం నుంచి బయటపడవచ్చు. అలాగే మంగళవారం పూట ఆంజనేయ స్వామిని ఉపాశించడం వల్ల కుజదోషం తగ్గుతుంది. కుజదోషం ఉన్నవాళ్లు మంగళవారం పూట నీసు తినకుండా ఎంతో నియమ నిష్ఠలతో పూజలు చేయడం ద్వారా ఈ దోషాల నుంచి సులభంగా బయటపడతారు.