Ads
మీరు ఈ విషయాన్ని చాలా సార్లు వినే ఉంటారు అప్పుడే పుట్టిన శిశువుల్లో పచ్చకామెర్లు వస్తాయని.. అయితే పచ్చకామెర్లు ఎందుకు అప్పుడే పుట్టిన శిశువుల్లో వస్తాయి..? దానికి కారణం ఏమిటి..? ఒకవేళ వస్తే దానిని మనం సీరియస్ గా తీసుకోవాలా లేదా ఇలా ఎన్నో సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం. చాలామంది పుట్టిన పిల్లలకి పచ్చ కామెర్లు వస్తాయి. ఇది సహజం.
ఆ తర్వాత పచ్చకామెర్లు ఉన్నాయని పిల్లల్ని నర్సులు తీసుకువెళ్లి పోతారు. మూడు రోజులు పాటు లైట్ల కింద ఉంచాలని కేవలం పాలు పెట్టినప్పుడే బయటకు తీసుకురమ్మని అంటూ ఉంటారు. దాదాపు 70 శాతానికి పైగా పిల్లల్లో పుట్టిన వెంటనే కామెర్లు వస్తాయి.
Ads
పుట్టినరోజు కామెర్లు కనపడతాయి. ఇలా జరిగితే అసలు భయపడక్కర్లేదు. పుట్టిన తర్వాత బయట వాతావరణానికి పిల్లలు అలవాటు పడే వరకు కూడా శరీరంలో అనేక రకాల మార్పులు జరుగుతాయి. అలాంటప్పుడు కామెర్లు కనపడతాయి. ఫోటో థెరపీ లైట్స్ కింద పిల్లలుని రెండు రోజులు ఉంచితే ఈ సమస్య తగ్గిపోతుంది. ఎండలో తిప్పినా కూడా ఇది తగ్గుతుంది. సీరియస్ గా ఎప్పుడు తీసుకోవాలంటే.. కొంతమంది పిల్లల్లో శరీరం పచ్చగా మారుతుంది. పిల్లలు యొక్క కాళ్లు చేతులు ముఖం కూడా రంగు మారిపోతాయి. యూరిన్ ముదురుగా వస్తుంది. అటువంటప్పుడు సీరియస్ గా తీసుకుంటారు డాక్టర్లు.
రెండు వారాలు కూడా ఇలానే ఉంటే అది రిస్క్. కొన్ని కొన్ని సార్లు ఇది ప్రాణాంతకంగా మారే ఛాన్స్ కూడా ఉంది. తల్లి బ్లడ్ గ్రూప్ నెగటివ్ ఉండి బిడ్డది పాజిటివ్ ఉన్నప్పుడు కామెర్లు తీవ్ర స్థాయిలో వస్తాయి. పెద్దవాళ్లల్లో అయితే లివర్ బిలురూబిన్ ని బయటకి పంపించేస్తుంది కానీ అప్పుడే పుట్టిన పిల్లలకి ఇలా కుదరదు. అందుకని రెండు మూడు రోజులు ఉంటుంది. చాలా మందికి ఫోటో థెరపీ ద్వారా నయం అయిపోతుంది. కంగారు పడక్కర్లేదు కానీ ఒకవేళ ఎక్కువ రోజులు ఉండి తగ్గకపోతే మాత్రం కచ్చితంగా వైద్యుల ని సంప్రదించడం అవసరం.