Ads
చాలామంది ఐపీఎల్ మ్యాచ్లను మిస్ అవకుండా చూస్తూ ఉంటారు. ఐపీఎల్ మ్యాచ్లు ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉంటాయి. ఆఖరి బంతి వరకు కూడా ఏ జట్టు నెగ్గుతుంది అనేది మనం చెప్పలేము. అందుకని టీవీ ని ఆఫ్ చేయకుండా మ్యాచ్ ముగిసే వరకు చాలా మంది టీవీకే అతుక్కుపోతుంటారు. ఈసారి ఐపీఎల్ సీజన్ లో ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారా అనేది చూడాలి…
ఐపీఎల్ నిర్వహించడం ద్వారా బీసీసీఐ ఏటా కోట్లలో సంపాదిస్తుంది అని మనం వింటూ ఉంటాం. ఐపీఎల్ జట్లని కొనుగోలు చేయడం వలన ఎవరికైనా కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈరోజు క్రికెటర్ల పై కోట్లు కుమ్మరించే ఐపిఎల్ జట్లు ఎలా సంపాదిస్తాయి వాటికి డబ్బులు ఎలా వస్తాయి అనే విషయాలను తెలుసుకుందాం..
BCCI , IPL జట్లకు అతిపెద్ద ఆదాయ వనరు టెలికాస్ట్ అలానే డిజిటల్ రైడ్‌లు. IPL 2008లో ప్రారంభమైన విషయం తెలిసిందే. టెలికాస్ట్ ప్రసారాలు 10 సంవత్సరాలు సోనీ లో కొనసాగాయి. 8,200 కోట్ల మొత్తంలో చాలా కాలం సోనీ ఏ హక్కులను పొందింది. ఆ తరవాత అనగా 2023 నుండి 27 వరకు బీసీసీఐ ఐదేళ్ల మీడియా హక్కులను స్టార్ స్పోర్ట్స్ జియో సినిమాలకు 48,390 కోట్ల రూపాయలకు విక్రయించింది.
Ads
ఒక ఏడాదికి చూస్తే రూ.9,678 కోట్లు. 30 శాతం మొత్తాన్ని తీసుకుంటుంది బీసీసీఐ. 70 శాతం మొత్తాన్ని ఐపీఎల్ జట్లకు. ఇదిలా ఉండగా ఇంకో ఆదాయమే టైటిల్ స్పాన్సర్‌షిప్. ఈ టోర్నమెంట్‌ను టాటా IPL అని అంటున్నారు. కానీ ఇది వరకైతే DLF IPL. తర్వాత డ్రీమ్ XI , Vivo IPL ఇలా పేర్లు ఉండేవి. ఈసారి టైటిల్ స్పాన్సర్‌షిప్ రైట్స్ టాటా గ్రూప్ వి.
టాటా గ్రూప్ ఒక్క సీజన్ కోసం బీసీసీఐకి రూ.670 కోట్లు ఇస్తుంది. ఇది వరకు వివో ఉండేది కదా… వాళ్ళు వివో ఒప్పందాన్ని మధ్యలో వదిలేసారు. దాంతో బిసిసిఐ ప్రతి సంవత్సరం మొత్తం 1,124 కోట్లు పొందుతోంది. ఈ రెండే కాక టీవీ ప్రకటనల రూపంలో కూడా డబ్బులొస్తాయి. ఒక్కో ఓవర్ తర్వాత యాడ్స్ వస్తాయి కదా.. వాటి ఖరీదు ప్రతి 10 సెకన్లకు దాదాపు 15 లక్షలు.
ఆటగాళ్ల బట్టలు, అంపైర్ బట్టలు అలానే హెల్మెట్లు మొదలైన వాటి మీద కూడా యాడ్లు వేస్తారు. ఇలా వీటి పైన భారీ మొత్తంలో సంపాదిస్తుంది. స్టేడియం లో మ్యాచ్ చూసే వాళ్ళు డబ్బులు కట్టే వెళ్ళాలి కదా.. వాటి పైన కూడా సంపాదిస్తుంది. ఒక్కో మ్యాచ్‌కి కనీసం ఐదు కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుంది. హోమ్ గ్రౌండ్‌లో అయ్యే మ్యాచ్‌లో 80 శాతం ఫ్రాంఛైజీ పొందుతుంది. మిగిలినది బీసీసీఐ పూల్‌కి.