హిజ్రాలు ఎదురొచ్చినా, ఆశీర్వదించినా మంచి జరుగుతుందా..? కీడు సంభవిస్తుందా..?

Ads

మనం ఎప్పుడైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే హిజ్రాలు ఆశీర్వదించడం జరుగుతుంది. అయితే నిజానికి చాలామంది హిజ్రాలని చూడగానే అదో రకమైన ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటారు. పైగా డబ్బులు కోసం వాళ్ళు వేధిస్తూ ఉంటారని చాలామందిలో ఉండే అభిప్రాయం. అందుకు హిజ్రాలు ఆశీర్వదించినా లేదంటే ఎదురుపడినా కూడా కీడు జరుగుతుందని ఇబ్బందులు వస్తాయని భావిస్తూ ఉంటారు.

చాలామంది నిజానికి హిజ్రాలని ఎంతో చులకనగా చూస్తూ ఉంటారు కానీ కొందరు మాత్రం హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. అయితే నిజంగా హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందా… వాళ్ళు మనకి ఎదురుపడితే కీడు జరుగుతుందా.. లేదా మేలు జరుగుతుందా అనే విషయాలని ఇప్పుడు చూద్దాం.

విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న పెద్ద చెరువుగట్టు పై వెళుతూ ఉంటే మనకి శ్రీ విజయసాగర దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం కనపడుతుంది. ఆ ఆలయంలో విశేషమేంటంటే అక్కడ పనిచేసే పూజారుల నుండి అందరూ కూడా హిజ్రాలే. ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ హిజ్రాలే భక్తుల పేరుపై అర్చన చేస్తూ ఉంటారు అమ్మవారికి నిత్యం పూజలు కూడా వాళ్లే చేస్తూ ఉంటారు.

Ads

మనసుపెట్టి అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది హిజ్రాలు ఆశీర్వదించినా లేదంటే వాళ్ళు ఎదురు వచ్చినా మంచే జరుగుతుందని భావిస్తారు. రాజుల కాలం నుండి హిజ్రాలకి స్పెషల్ గుర్తింపు ఉంది. అందులో సందేహం లేదు. చాలామంది రాజుల దగ్గర సలహాదారులుగా హిజ్రాలు పనిచేసేవారు.

ప్రజల అభిప్రాయాలని రాజుకి తెలియజేయడం పరిపాలనలో లోటుపాట్లు ఉంటే తెలపడం వంటివి హిజ్రాలు చేసేవాళ్లు. వీళ్ళు ఎదురు వచ్చినా వీళ్ళు మనల్ని ఆశీర్వదించినా మంచే జరుగుతుందంటారు. ఎందుకంటే హిజ్రాలు నిస్వార్థంతో ఆశీర్వదిస్తారని వారి పుణ్యఫలం ఆశీర్వాద రూపంలో అందుతుందని భావిస్తారు.

కొంతమంది హిజ్రాలు బలవంతం పెట్టడం వలన వాళ్ల మీద నెగటివ్ అభిప్రాయం ఏర్పడుతోంది. అయితే వాళ్లు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని లేదంటే చెడు జరుగుతుంది అనేది కేవలం నమ్మకం మాత్రమే. నమ్మకాల మీద ఆధారపడి ఉంది ఎలాంటి రుజువు లేదు ఎవరి నమ్మకం వారిది.

Previous articleఐపీఎల్ జట్లు ఎలా సంపాదిస్తాయి..? ఎక్కడ నుండి అన్ని కోట్లు వస్తాయి..?
Next articleఅపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో ఏసీ ఎందుకు లేదు..? కారణం ఏమిటి అంటే..?