ఎండకాలంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే కలిగే ఆరోగ్య సమస్యలు ఇవే..

Ads

ఎండాకాలంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. సమ్మర్ మొదలయ్యే ముందు పిల్లలకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయి. దాంతో పిల్లలు ఎండలో ఎక్కువగా తిరుగుతుంటారు. సమ్మర్ హాలిడేస్ లో సంతోషంగా ఆడుకునే పిల్లలకి ఎండలో తిరిగితే వచ్చే సమస్యల గురించి తెలియకపోవచ్చు.

Ads

వేసవిలో ఉష్ట్రోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలను, చర్మ సమస్యలను కలిగిస్తాయి. సూర్యుడి నుండి వచ్చే UV రేస్, వేడి వల్ల వచ్చే చెమట వలన పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేసవి కాలంలో పిల్లలను, వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో పిల్లల గురించి జాగ్రత్తలు పాటించకుంటే వచ్చే సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.డీహైడ్రేషన్:
ఎండలలో బయట ఆడుకునే పిల్లలు నీరు తాగడం మరచిపోతుంటారు. దాని వల్ల తొందరగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. అందువల్ల వేసవిలో పిల్లలతో రోజుకు 7,8 గ్లాసుల నీటిని తాగించాలి. అలాగే పుచ్చకాయలు, పండ్ల రసాలు ఇస్తూ ఉండాలి.2.కీటకాలు కాటు:
వేసవిలో ఎక్కువగా దోమలు వస్తుంటాయి. దోమలు మాత్రమే కాకుండా వేరే కీటకాల కాటు వల్ల పిల్లలు శరీరం పై  దురద, వాపు రావచ్చు. డాక్టర్లస్ సలహా మేరకు పిల్లల కోసం దోమల నివారణ మందులను  ప్రయత్నించండి.
3.వేసవి ఫ్లూ:
ఐదు ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సంవత్సరం పొడవునా ఫ్లూ సమస్యలు తరచుగా వస్తుంటాయి. అందువల్ల పిలల్లను ఎండలో తిరగకుండా చూడాలి. ఉదయం లేదా సాయంత్రం వేళ చల్లగా ఉన్నప్పుడే ఆడుకోనివ్వాలి. పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తిని పెరిగేలా చేయవచ్చు.4.జీర్ణకోశ సమస్యలు:
కలుషితమైన ఆహారం లేదా కలుషితమైన పానీయాలు తీసుకోవడం వల్ల రక రకాల జీర్ణకోశ సమస్యలు ఏర్పడుతాయి. అలాంటి వాటిలో కడుపునొప్పి, ఎసిడిటీ, గ్యాస్‌ లాంటివి ఎక్కువగా ఉంటాయి. శుభ్రత లేని ఆహారం తీసుకుంటే, అందులో ఉండే హానికర సూక్ష్మజీవుల వల్ల పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.5.చర్మ సమస్యలు:
ఎండాకాలం వేడి, తేమ వలన చెమట ఎక్కువగా వస్తుంది. దాంతో తామర, దురద లాంటి  చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చర్మం కమిలిపోవడం, చెమటకాయలు కూడా రావచ్చు. కాబట్టి పిల్లలకు ఎక్కువగా  చెమట వచ్చినపుడు శుభ్రమైన క్లాత్ తో తుడవాలి. కాటన్ దుస్తులు వేయాలి.
Also Read: విపరీతమైన డిప్రెషన్, గుండె జబ్బులకు కారణం కరోనా.. రీసెర్చ్ లో విస్తుపోయే నిజాలు..

Previous articleరచయితలుగా కెరీర్ మొదలు పెట్టి నటులుగా స్థిరపడిన 4 గురు యాక్టర్స్ వీరే..
Next articleసమంత లాగే ప్రాణాంతక వ్యాధులతో పోరాడి గెలిచిన 5 గురు హీరోయిన్లు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.