Ads
వాట్సాప్ తెలియని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరు వాట్సాప్ మీద ఆధారపడి ఉన్నాము. వాట్సాప్ ద్వారా మనం సులభంగా ఇతరులకి మెసేజ్లు పంపుకోవచ్చు. అలానే ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్లు, డాక్యుమెంట్స్ ఇలా ప్రతీది కూడా మనం వాట్సాప్ ద్వారా పంపుకోవచ్చు.
రెండు బిలియన్ మంది కి పైగా వాట్సాప్ ని ఉపయోగిస్తున్నాము. ఫ్రీ గానే మనం వాట్సాప్ ను ఉపయోగించుకోవచ్చు. కేవలం ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది.
అయితే వాట్సాప్ మనకి ఫ్రీగా సర్వీసులను ఇస్తుంది కదా మరి వాట్సాప్ కి డబ్బులు ఎలా వస్తాయి..? ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా..? సందేహం ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి. వాట్సాప్ ని ఉపయోగించడం పూర్తిగా ఫ్రీయే. వాట్సాప్ ని ఉపయోగించేందుకు మనం ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు. వాట్సాప్ లో బిజినెస్ అకౌంట్స్ కోసం సైన్ అప్ అవ్వచ్చు.
Ads
సేల్స్ మరియు సపోర్ట్ కోసం వాట్సాప్ బిజినెస్ ని వాడుతూ ఉంటారు. వాట్సాప్ బిజినెస్ API ని పెద్ద పెద్ద బ్రాండ్లు అయినటువంటి నెట్ ఫ్లిక్స్, ఊబర్, విష్ వంటి బిజినెస్ల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ బిజినెస్ ల కోసం వాట్సాప్ డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. అయితే డబ్బులు ఎంత చెల్లించాలి అనేది మెసేజ్ లని బట్టి ఉంటుంది. కొత్త బిజినెస్ API ఫర్ వాట్సాప్ ఎలా ఛార్జ్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.
మొదటి 250,000 మెసేజ్లకి: ప్రతి మెసేజ్ కి $0.0085
తదుపరి 750,000 మెసేజ్లకి: ప్రతి మెసేజ్ కి $0.0083
నెక్స్ట్ 2 మిలియన్ మెసేజ్లకి : ప్రతి మెసేజ్ కి $0.0080
నెక్స్ట్ 3 మిలియన్ మెసేజ్లకి : ప్రతి మెసేజ్ కి $0.0073
నెక్స్ట్ 4 మిలియన్ మెసేజ్లకి: ప్రతి మెసేజ్ కి $0.0065
10 మిలియన్ల కంటే ఎక్కువ మెసేజ్లు: ఒక్కో మెసేజ్ కి $0.0058
వాట్సాప్ పే:
వాట్సాప్ పే ఫీచర్ కూడా ఇప్పుడు వచ్చింది. ఇది పే పాల్ లాగ పని చేస్తుంది వాట్సాప్ ద్వారా స్నేహితులకి, కుటుంబ సభ్యులకి లేదా ఇంకెవరికైనా ఫ్రీగా డబ్బులు పంపించొచ్చు. ఒక ట్రాన్సాక్షన్ కి 3.9 శాతం వాట్సాప్ కి వస్తుంది.