సంవత్సరం తర్వాత OTT లోకి వచ్చిన ఈ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?

Ads

కొన్ని సినిమాలు రిలీజ్ అయిన కొన్ని నెలలకే ఓటీటీలోకి వస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం సంవత్సరాలు తర్వాత వస్తాయి. అలా ఇటీవల ఒక సినిమా విడుదల అయిన ఒక సంవత్సరం తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఆ సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు.

ఆ సినిమా పేరు సువర్ణ సుందరి. హీరోయిన్ పూర్ణ, సాక్షి చౌదరితో పాటు, జయప్రద గారు కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. పూర్ణ మనందరికీ తెలిసిన వారే. సాక్షి చౌదరి కూడా అల్లరి నరేష్ హీరోగా నటించిన జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

suvarna sundari amazon prime review telugu

ఇంకా చాలా సినిమాల్లో సాక్షి చౌదరి నటించారు. వీరు మాత్రమే కాకుండా, సాయికుమార్, నాగినీడు, కోటా శ్రీనివాసరావు వంటి గుర్తింపు పొందినవారు కూడా ఈ సినిమాలో కొన్ని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా గత సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది. భారీ గ్రాఫిక్స్ తో రూపొందిన ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంది.

suvarna sundari amazon prime review telugu

Ads

15వ శతాబ్దం, 18 శతాబ్దం, 19వ శతాబ్దం, ఇప్పుడు ఉన్న కాలం. ఈ నాలుగు సమయాల్లో సినిమా సాగుతుంది. త్రినేత్రి అనే ఒక విగ్రహం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వర్షన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూడాలి అంటే 79 రూపాయలు కట్టాలి. మరి కొంత కాలం తర్వాత అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబ్ర్స్ కి ఈ సినిమా ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

suvarna sundari amazon prime review telugu

ఎంఎల్ లక్ష్మీ నిర్మించిన ఈ సినిమాకి, ఎంఎస్ఎన్ సూర్య దర్శకత్వం వహించారు. సాయి కార్తీక్ సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలో నటించిన నటీనటుల పర్ఫార్మెన్స్ కి మంచి పేరు వచ్చింది. సినిమాలో పూర్ణ కూడా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించారు. నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది. సాక్షి చౌదరి కూడా ఒక కొత్త గెటప్ ఉన్న పాత్రలో నటించారు. ఒక ముఖ్యమైన పాత్ర, సినిమాని ముందుకు నడిపించడానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఒక పాత్రలో సీనియర్ నటి జయప్రద గారు నటించారు. గ్రాఫిక్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.

ALSO READ : చిరంజీవి హీరోయిన్ ఏంటి ఇప్పుడు ఇలా అయిపోయింది.. ఆమె వేల కోట్లకి అధిపతి అని మీకు తెలుసా..?

Previous article”వాట్సాప్” కి డబ్బులు ఎలా వస్తాయి..? మీకు తెలుసా..?
Next articleశనివారం రోజు నాన్-వెజ్ తినకూడదు అని ఎందుకు అంటారు..? కారణం ఏంటంటే..?