Ads
చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం పేరు మారుమోగిపోతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది.
ఈ నేపథ్యంలో చందమామ పై స్థలం కొనుగోలు చేసే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య తెలంగాణకు చెందిన మహిళ తన తల్లికి జాబిల్లి పై స్థలం కొని వార్తల్లో నిలిచింది. తాజాగా ఒక వ్యక్తి తన వైఫ్ కు పుట్టినరోజు గిఫ్ట్ గా అలాంటి కానుక ఇచ్చాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Ads
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఝర్‌గ్రామ్ లో నివసించే సంజయ్ మహటో తన వైఫ్ అనుమిక బర్త్ డేకు గిఫ్ట్ గా జాబిల్లి పై ఒక ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే చందమామ పై ఒక ఎకరం భూమి ఖరీదు రూ. 10,000 లు కావడం గమనార్హం. సంజయ్, అనుమిక చాలా కాలం లవ్ చేసుకున్న తరువాత ఈ సంవత్సరం ఏప్రిల్ లో వివాహం చేసుకుని ఒకటయ్యారు.
సంజయ్ మహటో మాట్లాడుతూ వివాహానికి ముందు అనుమిక జాబిల్లిని తీసుకువస్తానని చెప్పినట్లు పేర్కొన్నాడు. తానిచ్చిన్న హామీ ప్రకారం చంద్రయాన్ 3 సక్సెస్ అవడంతో చంద్రుడి పై స్థలాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. వివాహానికి ముందు ఇచ్చిన మాట ప్రకారం వివాహం తరువాత వచ్చిన భార్య మొదటి బర్త్ డే సందర్బంగా చందమామ పై ఫ్లాట్‌ను అనుమికకు బహుమతిగా ఇచ్చానని సంజయ్ వెల్లడించాడు.
సంజయ్ మాట్లాడుతూ తన ఫ్రెండ్ సహాయంతో లూనా సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా చంద్రుని పై స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ ప్రక్రియ అంతా పూర్తి అవడానికి సుమారు సంవత్సరం పట్టిందని వివరించాడు. అనుమిక తన భర్త సంజయ్ ఇచ్చిన ఈ కానుకతో చాలా సంతోషపడుతోంది. చంద్రుడి పై స్థలం కొనుగోలు చేయడం అనేది, ప్రైవేట్ ఓనర్ షిప్ కాకపోయినా పలు వెబ్‌సైట్లు చంద్రుడి పై స్థలాన్ని అమ్ముతూ, సర్టిఫికేట్స్ కూడా జారీ చేస్తున్నాయి.