స‌రిగ్గా వన్డేలు కూడా ఆడ‌లేదు… అత‌నికి ఇండియా వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్‌లో చోటు ఎందుకు.?

Ads

అజిత్ అగార్కర్ అడుగుజాడల్లో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో టీం ఇండియా జట్టును ప్రకటించింది. అందరూ ముందుగా ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఆసియా కప్ కోసం ప్రకటించిన అదే జట్టు నుంచి చాలా వరకు ఆటగాళ్లను ఎంపిక చేయడం జరిగింది.

వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ఎంపిక చేసిన టీమ్ ని భారత్ సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 5 న ప్రకటించింది. జట్టులో కొందరి ప్లేయర్ల ఎంపికపై మాత్రం క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

this player for world cup

మరీ ముఖ్యంగా వన్డే ఫార్మాట్ కు ఏ మాత్రం సెట్ కానీ సూర్య కుమార్ యాదవ్ ని కూడా వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేయడంపై పలు రకాల విమర్శలు వస్తున్నాయి. టి20 సిరీస్ లో అద్భుతంగా రాణించి నెంబర్ వన్ బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్న సూర్య కుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్లో మాత్రం పేలవమైన ప్రదర్శనతో వెనుకంజలో ఉన్నాడు. మరి అలాంటి ఆటగాడిని వన్డే మ్యాచ్ కి సెలెక్ట్ చేయడం ఏంటా..? అని పలు రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

this player for world cup

Ads

ఇప్పటివరకు సూర్య కుమార్ సుమారు 26 మండే మ్యాచులు ఆడడం జరిగింది.. అందులో 24 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన అతను చాలావరకు తక్కువ స్కోరుకే పెవీలియన్ వైపు పరుగులు పెట్టాడు. 24 ఇన్నింగ్స్ కి కలిపి కేవలం 51 పరుగులు చేశాడు అంటే అతడు వన్డే ఫార్మాట్లో ఎంత వీక్ గా ఉన్నాడో తెలుస్తుంది. మరి అలాంటి ప్లేయర్ని ప్రపంచ కప్ ఎలా ఎంపిక చేశారు…అనే విషయం కేవలం బీసీసీఐకి మాత్రమే తెలియాలి.

this player for world cup

వన్డే ఫార్మాట్ లో ఒత్తిడి తట్టుకొని బాగా రాణించగలిగే తిలక్ వర్మ,సంజూ సామ్సన్ లాంటి ఆటగాళ్లను పక్కనపెట్టి సూర్య కుమార్ యాదవ్ కు అవకాశం ఇవ్వడం నిజంగా ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. సూర్య కుమార్ యాదవ్ లాగా సంజూ సామ్సన్ పొరపాటున వన్డే ఫార్మాట్లలో తడబడి ఉంటే ఈపాటికి అతను జట్టు నుంచి ఇంటికి చేరిపోయేవాడు. మరి ఒక్క సూర్య కుమార్ యాదవ్ విషయంలోనే ఎందుకు ఇంత ఏకపక్షపాతమైన నిర్ణయము అర్థం కావడం లేదు.

ALSO READ : ఇండియా కెప్టెన్ అయ్యుండి ఇలా చేస్తావా రోహిత్.? సిగ్గుపడాలి అంటూ నేపాల్ తో మ్యాచ్ తర్వాత ఫ్యాన్స్ ఫైర్..!

Previous articleఇలాంటి గిఫ్ట్ ఎవరు ఇవ్వరు అనుకుంటా..? పెళ్లికి ముందు హామీ ఇవ్వడమేంటి..? భర్త ఏం చేసారంటే.?
Next article“బాధ చెప్పుకోవడానికి వచ్చాను..!” అంటూ… అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు నాయుడు భార్య..! ఏం అన్నారంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.