Ads
గతంలో నిస్తేజంగా సాగిన పరిమిత ఓవర్‌ల క్రికెట్ ను ఐసీసీ కొత్త రూల్స్ తో రసవత్తరంగా మార్చిన విషయం తెలిసిందే. ఇకపై మరింత రసవత్తరంగా పరిమిత ఓవర్‌ల క్రికెట్ ను మార్చడం కోసం ఐసీసీ కొత్త రూల్ ను తీసుకొచ్చింది.
Ads
అహ్మదాబాద్‌లో మంగళవారం నాడు జరిగిన ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) బోర్డు మీటింగ్ కొత్త నిబంధన తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ డిసెంబర్ 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు పురుషుల వన్డే మరియు టీ20 క్రికెట్‌లో ఓవర్‌ల మధ్య సమయాన్ని నియంత్రించడానికి ప్రయోగాత్మకంగా స్టాప్ క్లాక్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఇటీవలి కాలంలో, ఐసీసీ క్రికెట్ నియమాలను మెరుగుపరచడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఓవర్‌ల మధ్య బౌలర్లు తీసుకునే సమయాన్ని కంట్రోల్ చేయడానికి స్టాప్ క్లాక్ విధానాన్ని మొదటిసారిగా ఉపయోగించనుంది.
ఐసీసీ కొత్త రూల్ ప్రకారం, వన్డేలు, టీ20 మ్యాచ్ లలో ఒక ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు మరో ఓవర్ ను వేయాల్సి ఉంటుంది. ఒకవేళ బౌలింగ్ చేసే జట్టు, ఈ రూల్‌ను ఇన్నింగ్స్‌లో 3 సార్లు ఉల్లంఘించి నట్లయితే, అందుకు పెనాల్టీగా బ్యాటింగ్ చేసే జట్టుకు 5 పరుగులు లభిస్తాయి. పరిమిత ఓవర్ క్రికెట్‌లో ఆటను వేగవంతంగా చేసే ప్రయత్నంలో ఐసీసీ ఈ నిబంధనను తీసుకొచ్చింది. అందువల్ల బౌలింగ్ చేసే జట్టు 60 సెకన్‌లలోపు ఓవర్ వేయడానికి రెడీగా ఉండాలి.
ఒక మ్యాచ్‌లో 2 సార్ల కంటే ఎక్కువగా 60 సెకన్‌లలోపు ఓవర్ వేయడానికి ఆలస్యం చేస్తే, బౌలింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధించనున్నట్లు ఐసీసీ తెలిపింది. పెనాల్టీ 5 పరుగులు బ్యాటింగ్ చేసే జట్టు స్కోరులో కలుస్తాయి. మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ లు స్టాప్ క్లాక్ తో ఓవర్ల మధ్య సమయాన్ని నిర్ధారిస్తారు. క్రికెట్ విశ్లేషకులు ఈ రూల్ వల్ల పరిమిత ఓవర్ క్రికెట్‌లో స్లో ఓవర్ రేట్ తగ్గవచ్చని భావిస్తున్నారు. మంగళవారం జరిగిన ఐసీసీ సమావేశంలో పిచ్ మరియు అవుట్‌ఫీల్డ్ మానిటరింగ్ రూల్స్ లో మార్పులను ఆమోదించింది.
Also Read: ఇండియా కొంపముంచిన అంపైర్ కాల్…! అసలు అంపైర్ కాల్ అంటే ఏంటి…?