Ads
సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోలని తమ సొంత ఇళ్లల్లో మనుషుల లాగా చూసుకుంటారు. హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే వాళ్ల కటౌట్ లకి అభిషేకాలు చేస్తారు. ఇలాంటివి బాలీవుడ్ లో జరగవు. చాలా మంది బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. హీరోల పేర్ల మీద స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేయడం కూడా మన వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకే సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హీరోలు కూడా “మీరు లేకపోతే నేను” లేను అని చెప్తూ ఉంటారు.
Ads
తమ అభిమానులు ఆనందపడడం కోసం డాన్స్ చేయడం, ఫైట్స్ చేయడం, కొత్త కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ట్రై చేయడం మన హీరోలు చేస్తూ ఉంటారు. అభిమానుల సంతోషాన్ని వాళ్ళ సంతోషం లాగా అనుకుంటారు. చాలా మంది హీరోలు కూడా తమ అభిమానుల అభిప్రాయాలని అర్థం చేసుకొని, వాళ్లకి ఎలా అయితే నచ్చుతుందో అలానే సినిమాలు తీస్తూ ఉంటారు. ప్రతి స్పీచ్ లో, “ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది” అని చెప్తూ ఉంటారు. అంటే, హీరోలకి, వాళ్ళ అభిమానులకి మధ్య ఎక్కువ దూరం లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
అభిమానులు కూడా ఎలా ఉంటారు అంటే, హీరో చెయ్యి చూసి కూడా ఆ హీరో ఎవరు అనేది చెప్పేస్తారు. క్లారిటీ లేని హీరో పిక్చర్ చూసినా, లేదా కళ్ళ భాగం వరకు చూసి కూడా ఆ హీరో ఎవరు అనేది చెప్పగలుగుతారు. ఇప్పుడు ఈ పైన ఫోటోలో ఉన్న హీరో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మధ్యలో కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని తర్వాత మళ్లీ హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు. ప్రేక్షకులు ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఈ హీరో ఎవరో కనిపెట్టగలరా?