5 సంవత్సరాల తర్వాత మళ్లీ హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్న ఈ యాక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?

Ads

సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ వ్యక్తులు చాలా మంది ఉంటారు. సినిమాల్లో నటించడంతో పాటు, దర్శకత్వం వహించడం, సినిమాలని నిర్మించడం, పాటలు రాయడం ఇలా చాలా చేస్తూ ఉంటారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు.

అలాంటి ఒక వ్యక్తి హరనాథ్ పొలిచెర్ల. హరనాథ్ కొన్ని సినిమాలను నిర్మించారు. కొన్ని సినిమాలకి దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాల్లో నటించారు. ఒక సినిమాకి రైటర్ గా కూడా చేశారు.

hero who is re entering into movies after 5 years

హరనాథ్, ప్రేమాయ నమః, శర్వానంద్, రాజా నటించిన వెన్నెల, ట్రాప్, చంద్రహాస్, రాజేంద్ర, కెప్టెన్ రాణా ప్రతాప్ అనే సినిమాలని నిర్మించారు. కెప్టెన్ రాణా ప్రతాప్, రాజేంద్ర సినిమాలకు దర్శకత్వం వహించారు. చంద్రహాస్, ట్రాప్, అలెక్స్, హోప్, రాజేంద్ర, కెప్టెన్ రాణా ప్రతాప్ సినిమాల్లో హీరోగా నటించారు. చత్రపతి శివాజీ కథ ఆధారంగా రూపొందించిన చంద్రహాస్ సినిమాతో గుర్తింపు పొందారు. 2007లో వచ్చిన ఈ సినిమాకి శివశక్తి దత్త గారు దర్శకత్వం వహించారు.

Ads

hero who is re entering into movies after 5 years

ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు. చత్రపతి శివాజీ పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారు కనిపించారు. శరత్ బాబు, సుజాత, పునీత్ ఇస్సార్, సత్య ప్రకాష్, బ్రహ్మానందం, సన ఇలా ఎంతో మంది ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించారు. హరనాథ్ 2019లో కెప్టెన్ రాణా ప్రతాప్ సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్లీ 5 సంవత్సరాల తర్వాత మరొక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పేరు డ్రిల్. ఈ సినిమాకి హరనాథ్ దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించారు.

hero who is re entering into movies after 5 years

ఈ సినిమాలో కారుణ్య చౌదరి హీరోయిన్ గా నటించారు. రఘుబాబు, తనికెళ్ల భరణి, కోటేశ్వరరావు, జెమినీ సురేష్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించారు. అంతే కాకుండా ఈ సినిమాలో పాటలు కూడా రాశారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల చేశారు. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Previous article“దేవర ముంగిట నువ్వెంత..!” అంటూ… ఒక్క పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? మరొక హీరోకి వీరాభిమానిగా కూడా ఫేమస్..!
Next articleకన్నప్ప టీజర్‌లో ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..? ఈ మిస్టేక్ గమనించారా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.