Ads
హైదరాబాద్ పేరు వినగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే వంటకం బిర్యాని. నిజాం రాజులు ఎన్నో వంటలను పరిచయం చేసినప్పటికి బిర్యానికి ఉన్న క్రేజ్ ఇంకా ఏ వంటకు లేదనేది అక్షర సత్యం.
Ads
అయితే హైదరాబాద్ వెళ్ళినపుడు తప్పక తినాల్సిన వంటకాలు బిర్యానితో పాటు మరి కొన్ని ఉన్నాయి. ఈసారి హైదరాబాద్ వెళ్ళినపుడు సమయం దొరికితే మాత్రం ఇక్కడ చెప్పే వంటలు తిన్న తరువాతే తిరుగు ప్రయాణం అవ్వండి. ఇంతకి ఆ వంటలు ఏమిటో? వాటి స్పెషాలిటీ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం..
లాల్ చికెన్ తందూరి విత్ వార్కీ పరాటా:
హైదరాబాద్ గురించి ఎక్కువ తెలిసిన వాళ్లకు మరియు నాన్ వెజ్ ప్రియులకు ఈ వంటకం గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. అల్-అక్బర్ ఫాస్ట్ ఫుడ్ కార్నర్లో ఎక్కువగా దొరికే ఈ ఐటెం చాలా రుచిగా ఉంటుంది. ఎర్రని రంగులో ఉండే తందూరీ చికెన్ మరియు చికెన్ 65తో వార్కీ పరాఠాను రుచి చూడండి. ఆ హోటల్ ఎక్కడ ఉంటుంది అంటే షాప్ నెం. 20, 4-14, మక్కా మసీదు పక్కన, షా అలీ బండా రోడ్, చార్మినార్.జౌజీ హల్వా:
స్వీట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడేవారు కచ్చితంగా టేస్ట్ చేయాల్సిన వంటకం ఇది. ఈసారి హైదరాబాద్ వస్తే ఈ స్వీట్ ని రుచి చూడండి. ఇక ఈ స్వీట్ ను నిజాం రాజులు హైదరాబాద్ కు ఇచ్చిన తియ్యటి కానుక ఈ వంటకం అని అంటారు. శతాబ్దం క్రిందట ఒక 11 సంవత్సరాల టర్కిష్ బాలుడు ఈ స్వీట్ ను హైదరాబాద్ కు పరిచయం చేసాడని చెబుతారు. ఈ స్వీట్ తయారుచేయడానికి 16 గంటల సమయం పడుతుంది. మరి ఇది హమీదీ మిఠాయి షాప్ లో దొరుకుతుంది. ఈ షాప్ మొజాం జాహీ మార్కెట్ లో ఉంది.ఇరానీ చాయ్-ఉస్మానియా బిస్కెట్:
హైదరాబాద్ వచ్చి రాగానే చాలామంది చాయ్ రుచి చూస్తారు. అయితే ఉస్మానియా బిస్కెట్ తో రుచి చూసారంటే ఆ టేస్ట్ వేరని చెప్పాలి. ఈ చాయ్ దాదాపుగా హైదరాబాద్ లో ఎక్కడైనా లభిస్తుంది. అయితే నిమ్రా కేఫ్ ఈ చాయ్ కి ఫేమస్. ఈ కేఫ్ మక్కా మసీదు పక్కన, ఘాన్సీ బజార్ లో ఉంటుంది.
బగార్ రైస్:
ఈ వంటకం చేయడం కూడా చాలా తేలిక. హైదరాబాద్ నుండే ఈ వంటకం వివిధ ప్రాంతాలకు విస్తరించినట్టుగా చరిత్రలో ఉంది. చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ అది కాదంటే వెజ్ కర్రీస్ తో అయినా సరే బగార్ రైస్ తో చాలా రుచిగా ఉంటుంది. ఇక పెళ్ళిళ్ళు అయినా, ఇతర ఫంక్షన్ లలో ఎక్కువగా దీనినే వండుతున్నారు. బగార్ బౌల్ అనే హోటల్ లో బాగుంటుంది. ఇది లక్డికాపూల్ లో ఉంది.మరాగ్(మటన్ పాయా):
ఇక బిర్యాని తర్వాత హైదరాబాద్ లో అంత ఫేమస్ అయిన వంట మరాగ్. ఇది వండడానికి 7-8 గంటల సమయం పడుతుంది. ఈ వంటకంను స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తారు. ఇక దీనిని మటన్ పాయా అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. హోటల్ షాదాబ్ లో చాలా బాగుంటుంది. ఇది మదీనా సర్కిల్ లో ఉంటుంది.
రామ్ కీ బండి:
హైదరాబాద్ లో ఎన్ని టిఫిన్స్ ఎన్ని ఉన్నాకూడా రామ్ కీ బండి బాగా ఫేమస్. ఇక్కడ రుచికరమైన దోసెలు, ఇడ్లీలకు పెట్టింది పేరు. దాదాపు 30 ఏళ్లనుండి హైదరాబాద్ వాసులకు రుచికరమైన టిఫిన్స్ అందిస్తోంది.
Also Read:రాత్రి సమయంలో చపాతీ తింటే మంచిదా? భోజనం తింటే మంచిదా? ఈ విషయంలో వైద్యులు ఏమంటున్నారంటే?